Movie News

జూన్ 15.. బ్లాక్‌బస్టర్ డే


సినీ రంగానికి సంబంధించిన కొన్ని తేదీలు మైలురాళ్లలా నిలిచిపోతుంటాయి. ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌బస్టర్లు రిలీజైన రోజులను ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. జూన్ 15 అలాంటి తేదీనే. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చిర స్థాయిగా నిలిచిపోయే కొన్ని సినిమాలు ఇదే తేదీన విడుదలయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘లగాన్’ గురించి. ఈ చిత్రం 2001 జూన్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ రోజు పెద్ద ఎత్తునే సంబరాలు జరుగుతున్నాయి. ఎంతోమంది సినీ ప్రేమికులు ఈ చిత్రంతో తమ అనుభవాలను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఒక మూసలో సాగిపోతున్న భారతీయ సినిమాను గొప్ప మలుపు తిప్పి ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన చిత్రిమిది. భారతీయ సినిమా సత్తా ఏంటో ఆమిర్ ఖాన్-అశుతోష్ గోవారికర్ ఈ చిత్రంతో రుజువు చేశారు.

భారతీయులకు సంబంధించినంత వరకు సినిమా, క్రికెట్ అత్యంత ఆనందాన్నిచ్చే విషయాలు. ఆ రెండింటినీ మిక్స్ చేసి అద్భుతమైన సినిమాను అందించాడు అశుతోష్. బ్రిటిష్ హయాంలో కరువుతో అల్లాడుతున్న ఓ గ్రామంలో హీరో అతడి బృందం ఓ పందెం కాసి బ్రిటిష్ వారితో తలపడటం.. తీవ్ర భావోద్వేగాల మధ్య క్రికెట్ మ్యాచ్ సాగడం ఈ సినిమాలో యునీక్ పాయింట్. ఇందులో రసవత్తరంగా సాగే క్రికెట్ మ్యాచ్, అందులోని భావోద్వేగాలు అప్పటిదాకా ఏ సినిమాలోనూ ప్రేక్షకులు చూడలేదు. ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ సమయానికి ఇండియాలో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆమిర్ ఖాన్ కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరిగింది. అతడి స్థాయి అమాంతరం పెరిగింది. ఈ ఊపును కొనసాగిస్తూ అద్భుతమైన సినిమాలు ఎంచుకుని ఇండియాలో టాప్ స్టార్‌గా ఎదిగాడు. ‘లగాన్’కు ముందు, తర్వాత అశుతోష్ తీసిన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ అతడి జీవితానికి ఈ ఒక్క సినిమా చాలు అన్నట్లు తయారైంది.

ఇంకో విశేషం ఏంటంటే.. 2001 జూన్ 15న ‘లగాన్’కు పోటీగా మరో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కూడా విడుదలైంది. అది కూడా బ్లాక్‌బస్టర్ అయింది. ఆ చిత్రమే.. గదర్-ఏక్ ప్రేమ్ కథ. సన్నీ డియోల్-అమీషా పటేల్ జంటగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అప్పట్లో భారీ విజయం సాధించింది. ప్రేమకోసం పాకిస్థాన్‌కు వెళ్లి పోరాడే ఒక యోధుడి కథ ఇది. ‘లగాన్’ సినిమాతో పోటీపడి ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయింది. ఇక జూన్ 15 తెలుగు ప్రేక్షకులకు కూడా మరపురాని తేదీనే. మోహన్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పెదరాయుడు’ విడుదలైంది ఇదే రోజు. అది 26వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణాన ఆ సినిమా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మోహన్ బాబును టాప్ స్టార్‌గా చూడం కానీ.. అప్పట్లో ‘పెదరాయుడు’తో ఆయన ఇండస్ట్రీ హిట్లకు దీటైన విజయాన్నందుకున్నారు.

This post was last modified on June 15, 2021 5:52 pm

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

6 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

7 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

8 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

8 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

8 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

9 hours ago