గతేడాది విడుదలైన ‘మనసానమః’ అనే షార్ట్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిఫరెంట్ లవ్ స్టోరీ, సరికొత్త స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ యూత్ ని ఆకట్టుకుంది. పదిహేను నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రాన్ని పొగుడుతూ అప్పట్లో అనుష్క, రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు ట్వీట్లు కూడా పెట్టారు. 70కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న షార్ట్ ఫిల్మ్‌గా రికార్డుల్లోకెక్కింది. దీన్ని దీపక్ అనే వ్యక్తి డైరెక్ట్ చేశారు. గతంలో ఈ డైరెక్టర్ ‘డబ్ల్యూటీఎఫ్'(వాట్ ఈజ్ ది ఫ్యాక్ట్), ‘ఎక్స్‌క్యూజ్‌మీ’, ‘హైడెన్ సీక్’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించారు.
వీటితో పాటు ‘ఫిదా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పని చేశారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తోంది. ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూనే మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఇటీవల దీపక్ చెప్పిన కథ నచ్చడంతో యూవీ క్రియేషన్స్ ఆయన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో శర్వానంద్ లేదా మరో యంగ్ హీరో ఎవరినైనా తీసుకోవాలని అనుకుంటున్నారు. హీరోని బట్టి సినిమా బడ్జెట్ పై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. అలానే మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టింది. ఇటీవల ఈ బ్యానర్ లో నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది!
This post was last modified on June 15, 2021 5:51 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…