టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి తాప్సీ.. స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేపోయింది. కొన్నాళ్లకు ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ హిట్టు మీద హిట్టు అందుకుంటుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ కథల కోసం తాప్సీను సంప్రదించే వారి సంఖ్య ఎక్కవైంది. అందుకే ఆమె ఏడాదికి అరడజను సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆమె తిరిగి తెలుగు సినిమాల్లో నటించదని అంతా అనుకున్నారు.
కానీ రీసెంట్ గా ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ తన రెండో సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో సాగుతుందట.
అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకపాత్ర కోసం తాప్సీను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఈ సినిమాలో హీరో ఆమె అనే చెప్పాలి. తాప్సీకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను కూడా వాడుకోవాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. అయితే ఆమె ఒప్పుకుంటుందో లేదో అనే సందేహాలతోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ ను ఆమె చేతిలో పెట్టగా.. స్క్రిప్ట్ చదివి సినిమా చేయడానికి అంగీకరించిందట. త్వరలోనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో తాప్సీ పాల్గొనే అవకాశం ఉంది.
This post was last modified on June 14, 2021 1:57 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…