Movie News

దుబాయ్ కి షిఫ్ట్ అవుతున్న హీరో ఫ్యామిలీ!

ప్రముఖ నటుడు నవాజుద్దీన్ ఫ్యామిలీ దుబాయ్ కి షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. నవాజుద్ధీ భార్య ఆలియా ఇద్దరు పిల్లల్ని తీసుకొని దుబాయ్ కి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. పిల్లల చదువు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో అందరూ ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టారు. ఈ పద్ధతి చాలా మంది పిల్లలపై ప్రభావం చూపుతుంది. తల్లితండ్రులకు కూడా ఆన్ లైన్ క్లాసుల వ్యవహారం నచ్చడం లేదు. కానీ చేసేదేం లేక సైలెంట్ గా ఉంటున్నారు.

అయితే కొందరు మాత్రం దీనికి ప్ర‌త్యామ్నాయం వెతుకుతున్నారు. పిల్లలను విదేశాలకు పంపించి చదివించడానికి సిద్ధమవుతున్నారు. నవాజుద్దీన్ దంపతులు కూడా తమ పిల్లల విషయంలో ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ క్లాసుల వలన పిల్లల ప్రవర్తలో చాలా మార్పొస్తుందని.. అందుకే వాళ్లను స్కూల్ కి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆలియా చెప్పారు. దుబాయ్ లో వారి బందులు ఉన్నారని.. స్కూల్ కి సంబంధించిన అడ్మిషన్ వ్యవహారాలన్నీ వాళ్లే దగ్గరుండి చూసుకున్నారని ఆలియా అన్నారు.

పిల్లలను విదేశాల్లో చదివించాలనే ఆలోచన ఎప్పటినుండో ఉందని.. కరోనా వలన ఆ ప్లాన్ కాస్త ముందుకు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తను మాత్రమే పిల్లలను తీసుకొని దుబాయ్ కి వెళ్తున్నట్లు చెప్పారు. అప్పుడప్పుడు వర్క్ కోసం, నవాజుద్దీన్ ను కలవడం కోసం ఇండియాకు వస్తుంటానని అలియా అన్నారు. వృత్తిరీత్యా నవాజుద్ధీన్ ముంబైలోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో మూడు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి.

This post was last modified on June 14, 2021 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago