మానస రాధాకృష్ణన్ అని మలయాళంలో ఒక చిన్న స్థాయి హీరోయిన్. చూడ్డానికి అందంగా, క్యూట్‌గా కనిపిస్తుంది కానీ.. అక్కడ పెద్దగా సినిమాలేమీ చేసింది లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రతిభ చూపించింది. స్కూలింగ్ తర్వాత దుబాయికి వెళ్లి చదువుకుని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కథానాయికగానే కాక క్యారెక్టర్ రోల్స్‌లో ఎనిమిది సినిమాలు చేసింది. ఆమె చేసినవన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. కథానాయికగా ఆమెకు పెద్ద స్థాయి ఏమీ లేదు. మానస వయసు 21 ఏళ్లు మాత్రమే.
ఇలాంటి కథానాయికను తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాకు కథానాయికగా ఎంపిక చేశారనే ప్రచారం ఎప్పుడో ఏడాది కిందట మొదలైంది. కొన్ని రోజుల పాటు ఈ ప్రచారం కొంచెం గట్టిగానే సాగింది. ఐతే దర్శకుడు హరీష్ శంకర్ లైన్లోకి వచ్చి ఈ ఊహాగానాలను ఖండించాడు.
అంతటితో వ్యవహారం సద్దుమణిగినట్లే అనుకుంటే.. ఈ మధ్య మళ్లీ ఇదే ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో పవన్ హీరోయిన్ అంటూ మానస గురించి కొందరు పోస్టులు పెట్టడంతో విషయం తన వరకు వెళ్లింది. ఇక ఈ ప్రచారాన్ని తనే స్వయంగా ఖండిస్తే తప్ప ఊహాగానాలు ఆగవని ఫిక్సయి మానసే స్పందించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తాను కూడా ఆరాధిస్తానని.. కానీ ఆయన సినిమాలో తాను నటిస్తున్నానన్న వార్త నిజం కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని కట్టిపెట్టాలని ఆమె కోరింది. అటు దర్శకుడు, ఇటు హీరోయిన్ ఇద్దరూ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా మానస గురించి ప్రచారం కట్టిపెట్టేస్తే బెటర్.
మరోవైపు ఈ సినిమా టైటిల్ గురించి కూడా కొన్ని రోజులుగా తెగ వార్తలొచ్చేస్తున్నాయి. సంచారి, స్టేట్ కి ఒక్కడు లాంటి పేర్లు హల్‌చల్ చేశాయి. కానీ అవేవీ నిజం కాదంటూ చిత్ర బృందం ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. మంచి టైం చూసి టైటిల్ అనౌన్స్ చేయాలని చూస్తోంది పీఎస్పీకే28 టీం.
This post was last modified on June 14, 2021 8:39 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…