యన్.టి.ఆర్, రూలర్ సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత దర్శకుల్లో తన ఫేవరెట్ అయిన బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా ద్వారా బలంగా పుంజుకునే ప్రయత్నంలో ఉన్న బాలయ్య.. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. మొన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.
ఐతే అదే రోజు అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా గురించి కూడా అనౌన్స్‌మెంట్ ఉంటుందని అభిమానులు ఆశించారు. ఈ చిత్రానికి కథ కూడా ఓకే అయిపోయిందని, నిర్మాతలుగా హరీష్ పెద్ది, సాహు గారపాటి కూడా ఖరారయ్యారని మీడియాలో ఇంతకుముందు వార్తలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక ప్రకటన లాంఛనమే అనుకున్నారు. కానీ బాలయ్య జన్మదినాన దీని గురించి ఏ ఊసూ లేకపోయింది. దీంతో ఈ సినిమా లేదేమో అన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ.
కానీ అభిమానులు నిరాశ చెందాల్సిన పని లేకుండా బాలయ్య ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. పుట్టిన రోజు నేపథ్యంలో బాలయ్య కొందరు అభిమానులతో జూమ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అనిల్ రావిపూడితో సినిమా గురించి అడిగాడు. దీనికి బాలయ్య బదులిస్తూ అతడిత సినిమా ఉంటుందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. ఇంకా మంచి మంచి సినిమాలతో రాబోతున్నట్లు కూడా బాలయ్య వెల్లడించాడు.
బహుశా ఇంకా ఈ సినిమాకు కథ ఖరారు కాకపోవడం, ఎప్పుడు సినిమా మొదలుపెట్టాలన్న స్పష్టత లేకపోవడం వల్ల ఇప్పుడే ప్రకటన ఎందుకని ఊరుకుని ఉండొచ్చేమో. బాలయ్యతో సినిమా చేయడం తన కల అంటూ అనిల్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకడు, పైగా తన అభిమాని అయిన అనిల్‌తో సినిమా చేయడానికి బాలయ్యకు అభ్యంతరం ఏముంటుంది?
This post was last modified on June 13, 2021 8:56 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…