‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్.. అలియా రెడీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె సీత క్యారెక్టర్ లో కనిపించింది. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమాను షూటింగ్ ను కొన్ని రోజుల్లో మొదలుపెట్టనున్నారు. దీనికి అలియా కూడా సిద్ధంగా ఉన్నట్లు రాజమౌళి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే దీనికంటే ముందుగా అలియా ‘గంగూబాయ్ కథియావాడీ’ సినిమాను పూర్తి చేయనుంది.

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఆ పాటను చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారు. మహారాష్ట్రలో షూటింగ్ కి పర్మిషన్లు రావడంతో జూన్ 15 నుండి చాలా సినిమాలు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ఈ క్రమంలో ‘గంగూబాయ్’ షూటింగ్ కూడా ఓ మంచి రోజు చూసి మొదలుపెట్టి ఒకే రోజులో పూర్తి చేయాలనుకుంటున్నారు. ఓవర్ నైట్ లో ఈ పాటను ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

నిజానికి ఈ పాటను చాలా గ్రాండ్ గా, ఎక్కువ మంది డాన్సర్లతో తెరకెక్కించాలని దర్శకుడు భన్సాలీ భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ముప్పై మంది డాన్సర్లతో పాటను పూర్తి చేయబోతున్నారు. దీని తరువాత అలియా ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ పైకి రాబోతుంది. వచ్చే నెల నుండి అలియా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వగానే ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.