పాన్ ఇండియా హీరోలు, హీరోయిన్లు, దర్శకుల మాదిరే.. పాన్ ఇండియా రైటర్లు కూడా కొందరున్నారు. ఆ అరుదైన జాబితాలోకే వస్తారు విజయేంద్ర ప్రసాద్. ‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ లాంటి సినిమాలతో ఆయన పాపులారిటీ దేశవ్యాప్తమైంది. ఇప్పుడాయన హిందీలో ఒక మెగా మూవీకి పని చేస్తున్నారు. ఆ చిత్రమే.. సీత. రామాయణ గాథను సీత కోణంలో కొంచెం వైవిధ్యంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నమిది. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇందులో సీత పాత్రను ఆలియా భట్ లేదా కరీనా కపూర్ ఎంపికవుతారని ప్రచారం సాగింది. చివరికి కరీనానే ఓకే అయినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆమె రూ.12 కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందని, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే ఈ సినిమా చేస్తానని కండిషన్ కూడా పెట్టిందని కొన్ని రోజుల కిందట మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమాలో కరీనా నటించే విషయంలో ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ‘సీత’ కోసం కరీనా ఖరారైందో లేదో ఇంకా తెలియకుండానే ఆమె ఈ సినిమాలో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైపోయింది. ముస్లిం అయిన సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు తన కొడుక్కి మొగల్ పేరైన తైమూర్ అని పెట్టుకోవడం చాలామందికి నచ్చట్లేదు. హిందువులకు పరమ పవిత్రమైన సీత పాత్రలో ఒక ముస్లిం వ్యక్తి భార్య నటించడం తమకు ఆమోదయోగ్యం కాదని వారంటున్నారు. బాయ్‌కాట్ కరీనా అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
‘ఆదిపురుష్’లో రావణుడి పాత్రకు ఎంపికైన సైఫ్ అలీఖాన్ ఇంతకుముందు రావణుడి గురించి సానుకూల వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఇప్పుడు అతడి భార్య సీత పాత్ర చేయబోతోందన్న వార్త ఓ వర్గానికి మింగుడు పడటం లేదు. మరి ఆమెతోనే సీత పాత్ర చేయించాలని ‘సీత’ టీం ఫిక్సయి ఉంటే మున్ముందు ఇబ్బందులు తప్పేలా లేవు.
This post was last modified on June 12, 2021 2:08 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…