కరోనా సెకండ్ వేవ్ లో స్టార్ హీరోలెవరూ కూడా ఓటీటీల వైపు చూడడం లేదు. కాస్త బజ్ ఉన్న సినిమాలకు మంచి బేరం కుదిరితే ఓటీటీలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతానికైతే చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా అక్కినేని అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఓటీటీలోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదని.. సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు మేకర్లు.
కానీ ఇప్పుడు సినిమాను ఓటీటీకి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు నిర్మాత బన్నీ వాసు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ పాట కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఎదురుచూసి అప్పటికీ థియేటర్ల పరిస్థితి సెట్ కాకపోతే ఓటీటీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
ఈ సినిమాతో పాటు అఖిల్ నటిస్తోన్న మరో సినిమాకి సంబంధించి కూడా ఓటీటీ ప్రయత్నాలు జరుగుతున్నాయట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘ఏజెంట్’ సినిమాకు ఏదైనా ఓటీటీ సంస్థ నిర్మాణ భాగస్వామిగా చేరితే.. సదరు సంస్థకు డైరెక్ట్ రిలీజ్ కింద సినిమాను ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఫీలర్లు వచ్చాయి. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు.
This post was last modified on June 12, 2021 9:02 am
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…