అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’ ఒక సినిమాగా మొదలైనప్పటికీ.. ఈ మధ్య దాన్ని రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి మేకర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దొరికిన ఖాళీలో కథను పొడిగించి.. రెండు భాగాలుగా విభజించే ప్రక్రియ నడుస్తోంది. బన్నీ వరుసగా ఈ రెండు భాగాల చిత్రీకరణలో పాల్గొంటాడన్న ఆలోచనతోనే అందరూ ఉన్నారు. కానీ బన్నీ మిత్రుడు, ‘గీతా ఆర్ట్స్’లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు ఇప్పుడో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన వాసు.. ‘పుష్ప-1’కు, ‘పుష్ప-2’కు మధ్య వేరే సినిమా చేస్తాడని వెల్లడించాడు. ఇది కూడా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు కానీ.. ఆ మధ్యలో అతను చేయబోయే సినిమా గురించి వాసు వెల్లడించిన సమాచారం మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపరిచేదే.
‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ పూర్తి చేశాక, సెకండ్ పార్ట్‌కు ముందు బన్నీ ‘ఐకాన్’ మూవీని చేయబోతున్నాడని బన్నీ వాసు వెల్లడించాడు. ఈ లైనప్ ఫైనల్ అని, ఈ విషయంలో ఏ మార్పూ లేదని కూడా అతను స్పష్టం చేశాడు. ‘ఐకాన్’ గురించి చర్చ ఇప్పటిది కాదు. మూడేళ్ల ముందే ఈ సినిమాను ప్రకటించారు.
కానీ అది పట్టాలెక్కే సూచనలు ఎప్పుడూ కనిపించలేదు. ‘వకీల్ సాబ్’తో వేణు శ్రీరామ్ సత్తా చాటుకున్న నేపథ్యంలో ఈ సినిమా మొదలైపోతుందని అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఆ దిశగా సంకేతాలు ఇచ్చాడు. కానీ బన్నీ వైపు నుంచి మాత్రం ఏ అప్‌డేట్ లేదు. అతను వేరే దర్శకులతో సంప్రదింపులు జరపడం చూస్తే ‘ఐకాన్’ చేసే ఉద్దేశంలో లేడనిపించింది.
ఆ కథను మరో హీరోతో చేయడానికి వేణు రెడీ అయినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బన్నీని ‘ఐకాన్’గా చూసే అవకాశాలు లేవనుకున్నారంతా. కానీ ఇప్పుడేమో బన్నీ వాసు.. ‘పుష్ప-1’ అవ్వగానే బన్నీ ‘ఐకాన్’ చేస్తాడంటున్నాడు. ఇదిలా ఉండగా.. మురుగదాస్, బోయపాటి శ్రీనులతో కూడా బన్నీ సినిమాలు చేయాల్సి ఉందని.. ఐతే ఏ సినిమా ఎఫ్పుడు ఉంటుందో చెప్పలేనని బన్నీ వాసు చెప్పాడు.
This post was last modified on June 11, 2021 1:24 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…