విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని చేసిన ‘గ్యాంగ్ లీడర్’ మీదే విడుదలకు ముందు భారీ అంచనాలే నెలకొన్నాయి. విక్రమ్ మార్కు వైవిధ్యం, నాని మార్కు ఎంటర్టైన్మెంట్ ఉన్నట్లుగా కనిపించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించేలా కనిపించింది. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమా బాలేదు అనలేం. అలాగని పూర్తిగానూ మెప్పించలేకపోయింది.
ఓ మోస్తరు టాక్‌తో మొదలైన ‘గ్యాంగ్ లీడర్’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గానే నిలిచింది. ఈ సినిమా ఫలితం దర్శకుడు విక్రమ్‌ను తీవ్ర నిరాశకే గురి చేసింది. తర్వాతి సినిమాను మొదలుపెట్టడానికి అతను ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్.. నాగచైతన్యతో ‘థ్యాంక్ యు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఆడకపోవడం పట్ల విక్రమ్ ఇంకా విచారంతోనే ఉన్నాడని అతడి తాజా వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది.
తన భార్య శ్రీనిధి తన సినిమాలకు పెద్ద క్రిటిక్ అని.. తాను ఓ సినిమా చేయడానికి ముందు ఆమెకు కథ చెప్పి అంతా ఓకే అనుకున్నాకే ముందుకు వెళ్తానని.. ‘గ్యాంగ్ లీడర్’ స్క్రిప్టు విషయంలో ఆమె పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిందని విక్రమ్ చెప్పాడు. ఇక హీరో నానీకి కూడా ఈ సినిమా చాలా ఇష్టమని చెప్పాడు. ఈ సినిమా తీస్తున్నపుడు తాను చాలా నవ్వుకుంటూ పని చేశానని.. హీరో తనది కాకుండా వేరే వ్యక్తుల ప్రతీకారాన్ని తీసుకుని విలన్ మీదికి వెళ్లడం యునీక్ పాయింట్ అని విక్రమ్ అన్నాడు.
‘గ్యాంగ్ లీడర్’ హిందీతో పాటు తమిళం, మలయాళంలో రీమేక్ అవుతోందని.. ఓ దర్శకుడికి ఇంతకంటే సంతృప్తి ఏముంటుందని విక్రమ్ అన్నాడు. ఒక సినిమాకు హిట్ టాక్ వస్తే అది విడుదలైన తొలి శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే సంతోషించమని.. ఫ్లాప్ అయినా ఆ మూడు రోజులు మాత్రమే బాధపడి.. సోమవారం నుంచి కొత్త సినిమా పని మొదలుపెట్టాలని తనకో పెద్దాయన చెప్పాడని.. తాను అదే అనుసరిస్తున్నానని విక్రమ్ చెప్పాడు. ఈ వ్యాఖ్యతో పరోక్షంగా ‘గ్యాంగ్ లీడర్’ ఫ్లాప్ అని విక్రమ్ చెప్పకనే చెప్పినట్లయింది. కానీ ఈ ఫ్లాప్ మూవీకి మూడు భాషల్లో రీమేక్ తెరకెక్కుతుండటం విశేషమే.
This post was last modified on June 10, 2021 5:29 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…