థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేసేయడాన్ని థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై విచారం వ్యక్తం చేస్తూ ఐనాక్స్, పీవీఆర్ లాంటి సంస్థలు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడు కార్నివాల్ థియేట్రికల్ ఛైన్ సంస్థ లైన్లోకి వచ్చింది. ఐతే ఐనాక్స్, పీవీఆర్‌ల తరహాలో ఆ సంస్థ ప్రస్తుత పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేయలేదు.
ఆ సంస్థ సీఈవో సినిమాల డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గురించి అసలు కంగారు పడాల్సిన పనే లేదనేశాడు. నిర్మాతలు వడ్డీల భారం తగ్గించుకోవడానికి.. నష్టాలు తగ్గించుకోవడానికి ఈ మార్గం ఎంచుకుని ఉండొచ్చని.. వాళ్లను తప్పుబట్టలేమని అతనన్నాడు. తమ సినిమాలు ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాతల ఇష్టమని.. ఇందులో వాళ్లను నిందించడానికి ఏమీ లేదని అన్నాడు.
థియేటర్లు రిలీజయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఆ పరిస్థితులు వచ్చినపుడు విడుదల కోసం చాలా సినిమాలు ఎదురు చూస్తుంటాయని.. అన్నింటికీ థియేటర్లు కేటాయించడమే కష్టమవుతుందని.. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజైనా ఇబ్బంది లేదని అన్నాడు కార్నివాల్ సీఈవో. ఇలా మంచి మాటలన్నీ చెప్పి.. చివర్లో ఒక బాంబు పేల్చాడాయన.
ఇప్పుడు ఓటీటీల్లో రిలీజయ్యే ఏ సినిమానూ థియేటర్లలో రిలీజ్ కానివ్వమని ఆయన తేల్చేశాడు. ఇప్పుడే కాదు.. మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నాడు. ఆన్ లైన్ రిలీజ్ కోసం సినిమా తీసిన వాళ్లకు థియేటర్లలో అవకాశం లేదనేశాడు. ముందు ఓటీటీల్లో రిలీజ్ చేసి.. ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ ద్వారా కొంత డబ్బులు రాబట్టుకుందాం అనుకునేవాళ్లకు ఇది షాకే. ఈ హెచ్చరిక తర్వాత ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయాలనుకునేవాళ్లు కొంత వెనక్కి తగ్గే అవకాశముంది.
This post was last modified on May 18, 2020 8:07 am
"తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం." ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి…
నిన్న రాత్రి నుంచి ఏపీ తెలంగాణలో అఖండ 2 తాండవం థియేటర్లు జనాలతో నిండుగా కళకళలాడుతున్నాయి. సినిమా ఎలా ఉంది,…
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు. వరుసగా పెట్టే వాట్సాప్ స్టేటస్లు, స్థానిక నేతలపై తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో…
విశాఖపట్నం ఐటీ మ్యాప్పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి…
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…