బాలయ్యకి యూవీ స్పెషల్ బర్త్ డే విషెస్

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాగా.. ఆయనకు పలువురు సినీ తారలు, అభిమానులు, రాజకీయ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా.. బాలయ్య కి బర్త్ డే విషెస్ తెలియజేయడం విశేషం. బాలయ్య తో కలిసి దిగిన ఫోటోని కూడా ఆయన షేర్ చేశారు.

హ్యాపి బర్తడే నందమూరి బాలకృష్ణ సార్‌. మీ నటనతో, మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవ నిస్వార్థంగా కొనసాగాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నా.. ఇవే మీకు నా బెస్ట్‌ విషెస్‌. అంటూ ట్వీట్‌ చేశాడు.

ఈ సందర్భంగా యువీ తాను హైదరాబాద్‌కు వచ్చినప్పడు బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిని సందర్శించినప్పుడు బాలయ్య బాబుతో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం యువరాజ్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య అభిమానులు ఈ ట్వీట్ ని తెగ షేర్ చేసుకొని సంబరపడుతున్నారు.