‘బాహుబలి’తో ఆకాశాన్నంటే ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. ఇక ‘మహానటి’తో మేటి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. వీళ్ల కలయికలో సినిమా అనేసరికి ఎక్కడలేని ఎగ్జైట్మెంట్ కనిపిపించింది ప్రేక్షకుల్లో. ఈ చిత్రాన్ని అంతా అనుకూలిస్తే అక్టోబరులో మొదలుపెడదామని అనుకుంటున్నారు నిర్మాత అశ్వినీదత్.
ఐతే కరోనా ప్రభావం ఎలా ఉంటుందో.. ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నదాన్ని బట్టి షూటింగ్ అప్ డేట్ ఉంటుంది. ఐతే ఈ లోపు ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా రానా కనిపించబోతున్నాడని.. ‘బాహుబలి’ కాంబినేషన్ పునరావృతం కాబోతోందని వార్తలు వచ్చాయి. ఐతే ఈ విషయంలో నాగ్ అశ్విన్ వెంటనే స్పష్టత ఇచ్చేశాడు. ఇంకా కాస్టింగ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నాడు.
ప్రభాస్ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని.. దీనిపై మీరేమంటారంటూ ఓ ట్విట్టర్ ఫాలోవర్ నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించాడు. అందుకతను బదులిస్తూ ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని.. లాక్ డౌన్ కారణంగా కొన్ని పనులు మాత్రం ఆలస్యమవుతున్నాయని.. ఐతే స్క్రిప్టు తయారీకి మాత్రం బాగా సమయం లభిస్తోందని చెప్పాడు.
ఇక కాస్టింగ్ విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఏదీ ఫైనలైజ్ కాలేదని అతను తేల్చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ అని.. ‘ఆదిత్య 369’ తరహాలో సాగుతుందని.. ‘క్రిష్’ స్టయిల్లో ఉంటుందని.. ఇంకా ఏవేవో ప్రచారాలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ కథ అయితే అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందన్న సంకేతాలైతే చిత్ర బృందం నుంచి అందుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు.
This post was last modified on May 18, 2020 7:57 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…