ఓటీటీల హవా పెరగడంతో ఇప్పటికే చాలా మంది స్టార్లు డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా డిజిటల్ డెబ్యూకి సిద్ధంగా ఉన్నారని సమాచారం. గతంలో మహేష్ బాబుని ఇదే విషయంపై ప్రశ్నించినప్పుడు ‘మంచి స్టోరీ దొరకాలి కదా!’ అంటూ బదులిచ్చారు. ఇప్పుడు ఆయన స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా స్టోరీ దొరికిందని సమాచారం. కాబట్టి త్వరలోనే ఈ సూపర్ స్టార్ ను ఓటీటీలో చూసే ఛాన్స్ ఉందని టాక్. అసలు విషయంలోకి వెళ్తే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో సూపర్ పాపులారిటీ దక్కించుకున్న దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఇటీవల మహేష్ బాబుని కలిసినట్లు తెలుస్తోంది.
తాము తెరకెక్కించబోయే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 లో మహేష్ బాబుని తీసుకోవాలని రాజ్ అండ్ డీకే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సీజన్ 1లో సందీప్ కిషన్ క్యామియో రోల్ లో కనిపించగా.. సీజన్ 2లో సమంతను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. సమంతని తీసుకోవడం వలన సౌత్ లో ఈ సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. అదే విధంగా సీజన్ 3లో మహేష్ బాబుని తీసుకునే విధంగా సన్నాహాలు చేస్తున్నారట. పది, పదిహేను రోజులు ఆయన కాల్షీట్స్ ఇస్తే సరిపోతుందట. దీనికోసం మహేష్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట.
మహేష్ ఒక సినిమాకి తీసుకునే మొత్తంలో సగం రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారట ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్. ఈ సిరీస్ లో నటించడం వలన తను ఒప్పుకున్న సినిమాల డేట్స్ విషయంలో పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చని మహేష్ భావిస్తున్నారట. సినిమాల షూటింగ్ మధ్యలో కొన్ని రోజులు ముంబైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేయొచ్చనేది మహేష్ ప్లాన్. రాజ్ అండ్ డీకే గనుక మహేష్ రోల్ ను ఇంప్రెసివ్ గా డిజైన్ చేయగలిగితే ఆయన సీజన్ 3 లో కనిపించడం ఖాయమని చెబుతున్నారు.
This post was last modified on June 9, 2021 2:46 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…