తెలుగు, తమిళ చిత్రాల్లో మామూలు పాత్రలు చేసి.. హిందీలోకి వెళ్లి విభిన్నమైన పాత్రల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్‌లతో ఆకట్టుకున్న కథానాయిక తాప్సి పన్ను. కంగనా రనౌత్ తర్వాత ప్రస్తు బాలీవుడ్తంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆ స్థాయి ప్రభావం చూపుతున్న హీరోయిన్ తాప్సీనే. చివరగా ‘తప్పడ్’ సినిమాతో మంచి విజయాన్నందుకోవడమే కాక.. నటిగానూ తన ప్రత్యేకతను చాటుకుంది.
ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో మూణ్నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అందులో ఒకటి.. హసీనా దిల్‌రుబా. తాప్సితో పాటు ఇందులో విక్రాంత్ మాసే, హర్షవర్ధన్ రాణె ముఖ్య పాత్రలు పోషించారు. ఈ థ్రిల్లర్ మూవీ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జులై 2న ‘హసీనా దిల్ రుబా’కు ప్రిమియర్స్ పడబోతున్నట్లు వెల్లడైంది.
తాప్సి కెరీర్లో నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న తొలి చిత్రం ‘హసీనా దిల్‌రుబా’నే. రాఘవేంద్రరావు మాజీ కోడలు కనిక థిల్లాన్ రాసిన స్క్రిప్టుతో విని మాథ్యూ ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం. దీని టీజర్ కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
టీజర్ చూస్తే మరో సారి తాప్సి ప్రేక్షకుల మునసు దోచబోతున్నట్లు స్పష్టమైంది. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో బోలెడన్ని హిందీ చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కాగా.. మధ్యలో థియేటర్లు తెరుచుకోవడంతో ఈ ఒరవడి ఆగింది. కానీ సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ హిందీ సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నాయి. ‘రాధె’ లాంటి భారీ చిత్రం గత నెలలో ఓటీటీల్లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ నెలలో విద్యాబాలన్ సినిమా ‘షేర్ని’ రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత తాప్సి మూవీ ప్రేక్షకులను పలకరిస్తుంది. ప్రస్తుతం తాప్సి రష్మి రాకెట్, లూప్ లపేటా, శభాష్ మితు తదితర చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on June 7, 2021 9:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…