కరోనా వైరస్‌కు సంబంధించి అవగాహన పెంచడానికి ఇటు ప్రభుత్వాలకు తోడు అటు స్వచ్ఛంద సంస్థలు ఏడాది కిందట్నుంచి గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. అలాగే సెలబ్రెటీలు సైతం తమ వంతుగా చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. కానీ వైరస్ నియంత్రణలో అత్యంత ముఖ్యమైంది అయిన మాస్క్ విషయంలో జనాలు వ్యవహరించే తీరు చికాకు తెప్పిస్తుంటుంది.
బాగా చదువుకున్న వాళ్లు, అన్నీ తెలిసిన వాళ్లు కూడా మాస్క్ వినియోగంలో తప్పటడుగులు వేస్తుంటారు. సరిగ్గా మాస్క్ ధరించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తికి కారణమవుతుంటారు. దీనిపై నేరుగా ఉపదేశిస్తే జనాలకు ఎక్కదు కాబట్టి కొంచెం బిన్నంగా, వ్యంగ్యంగా మాస్క్ ధరించడంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు తమిళ, తెలుగు సినీ నటులు. కొంత కాలంగా వ్యాక్సినేషన్ సహా వివిధ అంశాలపై తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వీడియోలు చేస్తోంది.
ఈ క్రమంలోనే మాస్క్ ఎలా ధరించాలనే విషయంలో ఆమె ఒక సెటైరికల్ వీడియో చేసింది. ఇందులో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, యోగిబాబు తదితరులను భాగస్వాముల్ని చేసింది. మాస్క్ ఎలా ధరించకూడదో ఉదాహరణ పూర్వకంగా ఒక్కొక్కరు అందులో చూపిస్తారు. బయట జనాల్ని పరిశీలిస్తే కొందరు అంత వరకు మాస్క్ వేసుకుని ఉండి ఎదుటి వ్యక్తితో మాట్లాడాలనుకున్నపుడు మాస్క్ తీసేస్తారు. కొందరేమో మాస్క్ ఎప్పుడూ గడ్డం కిందే పెడతారు. కొందరు ముక్కును కవర్ చేయరు.
ఈ ఉదాహరణలకు తోడు ‘ఐ మాస్క్’ అంటూ ఒకరు కళ్లకు మాస్క్ వేసుకుంటే.. ఇంకొకరు ‘హెయిర్ బ్యాండ్ మాస్క్’ నుదుటికి మాస్క్ పెట్టుకున్నారు. ఇలా మాస్క్ ఎలా ధరించకూడదో సెటైరికల్‌గా చూపించి.. చివర్లో వరలక్ష్మి మాస్క్ ధరించడం ఎలాగో చూపించింది. కొంచెం సరదాగా, వ్యంగ్యంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే హల్‌చల్ చేస్తోంది. జనాల్లో చురుకుదనం పుట్టాలంటే ఇలాంటి వీడియోలే కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on June 8, 2021 7:18 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…