టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని సమంత ఇప్పుడు వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది. ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కి భారీ రెస్పాన్స్ వస్తుండడంతో పాటు.. సమంత పెర్ఫార్మన్స్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు నెటిజన్లు. ఈ సిరీస్ తో ఆమెకి నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ కూడా సమంత డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లాంటి పేరున్న సంస్థ సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె ఒప్పుకుంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సిరీస్ చేయాలని ప్లాన్ చేస్తుంది. నిజానికి నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటివరకు తెలుగుకి సంబంధించి సరైన సిరీస్ ఒక్కటి కూడా రాలేదు. దీంతో సదరు సంస్థ కూడా పాపులర్ యాక్టర్స్ కోసం చూస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంతకు వస్తోన్న క్రేజ్ చూసి వెంటనే ఆమెతో ఓ వెబ్ డ్రామాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది.
నెట్ ఫ్లిక్స్ తో పాటు హాట్ స్టార్ లాంటి సంస్థల దృష్టి కూడా సమంతపై పడిందని సమాచారం. నిజానికి సమంత గతంలో ‘ఆహా’ షోతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ షో వర్కవుట్ అవ్వలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2తో అమ్మడు క్రేజ్ పెరిగిపోయింది. కాజల్, తమన్నా లాంటి వాళ్లు డిజిటల్ హిట్ కోసం పరితపిస్తుంటే సమంత మాత్రం ఒక్క సిరీస్ తో అందరినీ దాటేసి ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం సమంత.. గుణశేఖర్ రూపొందిస్తోన్న ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఓ పక్క సినిమాలు, మరోపక్క సిరీస్ లతో సమంత చాలా బిజీగా గడుపుతోంది.
This post was last modified on June 7, 2021 2:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…