Movie News

ఫ్యామిలీ మ్యాన్-2 తెలుగులో ఎప్పుడు?

ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజ‌న్ కోసం భాష‌తో సంబంధం లేకుండా దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎదురు చూశారు. ఆ సిరీస్ తొలి సీజ‌న్ హిందీతో పాటు తెలుగు, త‌మిళం, ఇంగ్లిష్ భాష‌ల్లోనూ రిలీజైంది. ఆయా భాష‌ల్లో ప్రేక్ష‌కులు ఫ్యామిలీ మ్యాన్ చూసి ఆస్వాదించారు. ఐతే సెకండ్ సీజ‌న్ మీద హిందీ వాళ్లే కాక తెలుగు వాళ్లు కూడా భారీ అంచ‌నాల‌తో ఉన్నారు. త‌మ‌ భాష‌లోనే సెకండ్ సీజ‌న్ చూడాల‌ని ఆశ‌ప‌డ్డారు. కానీ దీని మేక‌ర్స్ రిలీజ్ రోజు పెద్ద షాకిచ్చారు. కేవ‌లం హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే రిలీజ్ చేశారు. ఇది తెలుగు వాళ్ల‌ను నిరాశ‌కు గురి చేసింది.

అమేజాన్ ప్రైమ్ ఇంత‌కుముందు మీర్జాపూర్ సెకండ్ సీజ‌న్ విష‌యంలోనూ ఇదే చేసింది. కొంచెం గ్యాప్ ఇచ్చి తెలుగు వెర్ష‌న్ రిలీజ్ చేసింది. కానీ ఆ సిరీస్ రెండో సీజ‌న్‌కు ముందే నెగెటివ్ టాక్ రావ‌డంతో ఆ త‌ర్వాత తెలుగు వాళ్లు పెద్ద‌గా చూడ‌లేదు.

ఐతే ఫ్యామిలీ మ్యాన్-2 సంగ‌తి అలా కాదు. తొలి సీజ‌న్‌కు దీటుగా మ‌లి సీజ‌న్ ఉండ‌టంతో అదిరిపోయే టాక్ వ‌చ్చింది. తెలుగులో ఈ సిరీస్ చూద్దామ‌ని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్ గ‌త ఏడాదే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా ఎప్పుడో ముగించారు. తెలుగు డ‌బ్బింగ్‌కు చాలానే టైం దొరికింది. అయినా స‌రే.. ఒకేసారి తెలుగులోనూ సిరీస్ ఎందుకు రిలీజ్ చేయ‌లేక‌పోయార‌న్న‌ది ప్ర‌శ్న. ఇందుకు వేరే కార‌ణాలున్నాయ‌ని అంటున్నారు.

ఫ్యామిలీ మ్యాన్-2 మీద త‌మిళులు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఒకేసారి అన్ని భాష‌ల‌తో పాటు త‌మిళంలోనూ రిలీజ్ చేస్తే త‌మిళ జ‌నాల నుంచి ఒకేసారి వ్య‌తిరేకత వ్య‌క్త‌మై ఎక్క‌డ సిరీస్‌ను ఆపేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందేమో అన్న భ‌యంతోనే కేవ‌లం హిందీ వ‌ర‌కు రిలీజ్ చేశారంటున్నారు. దీని వ‌ల్ల త‌మిళంలో దీని రీచ్ త‌క్కువ‌గా ఉంటుంది. కొంచెం వేడి త‌గ్గాక తెలుగు, త‌మిళంలో ఒకేసారి సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చే అవ‌కాశ‌ముంది. మొద‌ట హిందీతో పాటు తెలుగులోనూ సిరీస్ రిలీజ్ చేసి త‌మిళం వ‌ర‌కు ఆపితే.. అదొక వివాదంగా మారొచ్చు. అందుకే త‌మిళంతో పాటు తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ల‌ను కూడా హోల్డ్‌లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. రెండు వారాల త‌ర్వాత తెలుగు, త‌మిళ ఆడియోలు అందుబాటులో ఉండే అవ‌కాశ‌ముంది.

This post was last modified on June 7, 2021 12:06 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago