రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ఆర్టిస్టుల్లో చాలామంది ఒకప్పుడు తహతహలాడేవాళ్లు. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్లు. శివ, రంగీలా, సత్య, కంపెనీ లాంటి చిత్రాలతో అన్ని ఇండస్ట్రీల టాప్ స్టార్స్‌కు తనతో సినిమా చేయాలన్న కోరిక పుట్టించిన ఘనత వర్మ సొంతం. తెలుగులో చిరంజీవి సైతం వర్మతో ఓ సినిమా మొదలుపెట్టగా.. వర్మే దాన్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఇక హిందీలో ఆమిర్ ఖాన్.. వర్మతో అతడి కెరీర్ ఆరంభంలోనే రంగీలా చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్లలో వర్మను ఎక్కువగా నమ్మిందంటే అమితాబ్ బచ్చనే. వీరి కలయికలో అరడజనుకు పైగా సినిమాలు రావడం విశేషం. ఐతే అందులో సర్కార్ మాత్రమే పెద్ద విజయం సాధించింది.
సర్కార్ రాజ్, నిశ్శబ్ద్, రణ్, డిపార్ట్‌మెంట్, సర్కార్-3 సినిమాలు నిరాశ పరిచాయి. ఇందులో డిపార్ట్‌మెంట్, సర్కార్-3 చిత్రాలైతే పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఐతే వర్మ మీద ఎంతో గురి ఉన్న అమితాబ్.. ఫలితాలతో సంబంధం లేకుండా అతడితో పని చేస్తూనే వచ్చాడు. కానీ వర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయిన సమయంలోనూ సర్కార్-3 చేసి తల బొప్పి కట్టించుకున్న అమితాబ్.. ఇక మళ్లీ ఈ దర్శకుడితో పని చేయడనే అంతా అనుకున్నారు. కానీ వర్మ మళ్లీ బిగ్-బిని ఇంప్రెస్ చేసి ఓ సినిమా చేయడానికి ఆయన నుంచి కమిట్మెట్ తీసుకున్నాడని బాలీవుడ్ మీడియా తాజాగా రిపోర్ట్ చేస్తోంది.
లాక్ డౌన్ టైంలో క్లైమాక్స్ అని, థ్రిల్లర్ అని నాసిరకం సినిమాలు తీసిన వర్మను ఇంకా అమితాబ్ నమ్మి సినిమా చేస్తున్నాడంటే షాకవ్వాల్సిందే. తన దగ్గరికి ఎంతోమంది ప్రతిభావంతులైన ఫిలిం మేకర్స్ నరేషన్ కోసం వస్తున్నారని.. అవన్నీ వినే సమయం కూడా ఉండట్లేదని.. చాలా ప్రత్యేకమైన పాత్రలు, సినిమాలనే ఎంచుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన బిగ్-బి.. ఇప్పుడు వర్మ స్థాయిని చూడకుండా ఆయన్ని నమ్మి ఎలా సినిమా చేస్తాడో ఏమో?
This post was last modified on June 6, 2021 10:13 am
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…