ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమాను ప్రకటించారు. ఎన్టీఆర్ 30గా అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమాకు దర్శకుడు కాకుండా ఖరారైంది నిర్మాతలు మాత్రమే. కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.
సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో, దర్శకుడు కాకుండా వీరి పేర్లు మాత్రమే కనిపించాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొరటాల తొలి నాలుగు చిత్రాలకు పని చేసిన దేవిశ్రీ ప్రసాద్.. అలాగే ప్రస్తుతం భీకర ఫాంలో ఉన్న తమన్.. మరోవైపు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రేసులో నిలిచారు.
ఐతే అనిరుధ్‌నే ఎన్టీఆర్ 30కి రేసులో ముందున్నట్లు ఇంతకుముందే వార్తలు రాగా.. ఇప్పుడు అదే విషయం కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుందట. ఇప్పుడు ప్రత్యేక సందర్భం అంటూ ఏమీ లేకపోయినా.. అభిమానులను ఎంగేజ్ చేయడానికి ప్రకటన ఇవ్వబోతున్నారట. దీని గురించి ట్విట్టర్లో జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ 30 అనే హ్యాష్ ట్యాగ్ సైతం ట్రెండ్ అవుతుండటం విశేషం. దేవిశ్రీ, తమన్, అనిరుధ్‌ల్లో ఎవరు ఈ సినిమాకు పని చేస్తే బాగుంటుందని పోల్ పెడితే.. ఎక్కువమంది అభిమానులు అనిరుధ్‌కే ఓటేస్తుండటం విశేషం. ఇంతకుముందు అరవింద సమేతకు సంగీత దర్శకుడిగా ఖరారైనట్లే అయి అనూహ్యంగా ఆ సినిమాకు అనిరుధ్ దూరం కావాల్సి వచ్చింది. మరి ఈసారి తారక్‌తో పని చేసే అవకాశం లభిస్తున్న నేపథ్యంలో అతనెలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.
This post was last modified on June 6, 2021 7:45 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…