మీ డ్రీమ్ రోల్ ఏంటి.. ఫలానా పాత్ర నేను చేసి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారా.. ఏదైనా సినిమాలో ఛాన్స్ మిస్సయిందని ఫీలయ్యారా.. హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు వాళ్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. ముఖ్యంగా హీరోయిన్లకైతే ఈ క్వశ్చన్లు కామన్. కొందరు హీరోయిన్ల దగ్గర ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉంటాయి. కొందరు ఏం చెప్పాలో తెలియని అయోమయానికి గురవుతారు.
ఇంకొందరు మాత్రం ఈ ప్రశ్నలకు ‘నో’ అనే సమాధానమే చెబుతారు. తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా మంచి పేరు సంపాదించిన అంజలి ఈ కోవకే చెందుతుంది. ముందు తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత తమిళంలో మంచి స్థాయిని అందుకుని.. ఆపై తెలుగులోకీ రీఎంట్రీ ఇచ్చి ఇక్కడా సత్తా చాటిన అంజలికి కొన్నేళ్లుగా ఏమంత కలిసి రావడం లేదు. అవకాశాలు తగ్గాయి.
ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో మీకు ఆఫర్లు తగ్గాయేంటి.. ఏవైనా పాత్రలు మిస్సయ్యానని ఫీలయ్యారా అని అడిగితే.. తనదైన శైలిలో బదులిచ్చింది. వేరే హీరోయిన్ల వల్ల తనకు వచ్చే ఆఫర్లు ఎప్పుడూ తగ్గలేదని అన్న అంజలి.. కొత్త వారు వచ్చినంత మాత్రాన పాత వారికి ఆఫర్లు తగ్గుతాయని తాను అనుకోవడం లేదని అంది. ఒక పాత్రకు ఎవరు అయితే సూటవుతారో వాళ్లనే దర్శకులు ఎంచుకుంటారని.. అంతే తప్ప ఒకరి అవకాశాన్ని మరొకరు లాక్కునే పరిస్థితి ఉండదని అంజలి పేర్కొంది.
వేరే వాళ్లు చేసిన పాత్రలను తాను చేయాలని కోరుకోనని ఆమె చెప్పింది. ఫలానా పాత్రను నేను చేస్తే బాగుండేది అని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఇంకెప్పుడూ అనుకోను కూడా అని ఈ తెలుగమ్మాయి స్పష్టం చేసింది. తన దగ్గరికి వచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని.. రాని ఆఫర్ల గురించి ఎప్పుడూ బాధ పడనని అంజలి అంది. చివరగా తెలుగులో అంజలి ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రతో మెప్పించిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 5, 2021 3:51 pm
నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని…
క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…