ఏటా టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో తెలుగు రాష్ట్రాల పరిధిలో వరుసగా రెండో ఏడాది కూడా విజయ్ దేవరకొండ అగ్ర స్థానం సాధించిన సంగతి తెలిసిందే. 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడ లేని పాపులారిటీ సంపాదించినప్పటి నుంచి ఈ జాబితాలో విజయ్ హైలైట్ అవుతూనే ఉన్నాడు.
టాలీవుడ్లో ఎంతోమంది బిగ్ స్టార్స్ ఉన్నప్పటికీ.. వాళ్లను వెనక్కి నెట్టి విజయ్ వరుసగా రెండేళ్లు అగ్ర స్థానంలో నిలవడం విశేషమే. ఐతే అతడి పాపులారిటీ తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాదు. ఇండియా వైడ్ అతడికి ఫాలోయింగ్ ఉంది. అది ఇప్పుడు జాతీయ స్థౄయిలో టైమ్స్ గ్రూప్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలోనూ కనిపించింది. ఈ లిస్టులో విజయ్ రెండో స్థానంలో నిలవడం విశేషం.
బాలీవుడ్ స్టార్లను కూడా వెనక్కి నెట్టి నేషనల్ లెవెల్లో రెండో స్థానం సాధిండమంటే మాటలు కాదు. ఈ జాబితాలో అగ్ర స్థానం సాధించింది దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కావడం విశేషం. గత ఏడాది సుశాంత్ చనిపోయినప్పటి నుంచి అతడిపై ప్రేక్షకుల్లో అమితమైన ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయి. చనిపోయాక అతడి ఫాలోయింగ్ మరింత పెరిగింది. అతడిలో జనాలకు తెలియని మంచి లక్షణాల గురించి ఎంతో చర్చ జరిగింది. ఇప్పుడు మరణానంతరం అతను మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో అతను అగ్ర స్థానంలో నిలవడం తన పాపులారిటీకి నిదర్శనం.
ఇక ఈ జాబితాలో ఆదిత్య రాయ్ కపూర్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. దుల్కర్ కేరళ వరకు ప్రకటించిన జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. తమిళనాడు పరిధిలో రెండో స్థానం సాధించడం విశేషం. ఇక నేషనల్ లిస్టులో టైగర్ ష్రాఫ్, విరాట్ కోహ్లి, రణ్వీర్ సింగ్ వరుసగా 6, 7, 8 స్థానాల్లో నిలిచారు.
This post was last modified on June 4, 2021 10:29 pm
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…