టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఏటా ‘మోస్ట్ డిజైరబుల్’ మెన్ అండ్ వుమెన్ లిస్టు ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, ఇలా వేర్వేరు భాషలు, ప్రాంతాలకు ఈ లిస్ట్ ఇస్తుంటారు. తెలుగు ప్రాంతం విషయానికి వస్తే హైదరాబాద్ బేస్డ్‌గా ఈ జాబితాను ఇస్తుంటారు. ఈ లిస్ట్ ఇచ్చినపుడు సామాజిక మాధ్యమాల్లో బాగానే చర్చ జరుగుతుంటుంది. ఈ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంటుంది. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ప్రతిసారీ లాగే ఈ సారి కూడా ఈ జాబితాలో కొన్ని సిత్రాలు చోటు చేసుకున్నాయి.
ఈసారి ఈ జాబితాలో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్లు కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఐతే వీళ్లిద్దరినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రతిసారీ టాప్ ప్లేసుకు పోటీలో ఉంటారు కాబట్టి.. ఈ ఇద్దరినీ వార్షిక పోటీకి పరిగణించకుండా ‘ఫరెవర్ డిజైరబుల్’ లిస్టులో పెట్టేశారట. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముందు నుంచి ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది మహేష్ బాబును ఇందులోకి చేర్చగా.. ఈసారి ప్రభాస్ అందులోకి వెళ్లాడు.
ఇక వార్షిక జాబితాను పరిశీలిస్తే.. విజయ్ దేవరకొండ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ.. ఈ జాబితాలోకి అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ రావడమే చాలామందికి అర్థం కావడం లేదు. పైగా అతను 21వ స్థానంలో ఉంటే.. అడివి శేష్ (22), నితిన్ (25) నాని (26) తనకంటే దిగువన ఉన్నారు. ఆనంద్‌లో పోలిక పక్కన పెడితే.. శేష్, నితిన్, నాని ఇంత దిగువన ఉండటం సమంజసంగా అనిపించడం లేదు. అల్లు అర్జున్ కూడా 17వ స్థానానికి పరిమితం కావడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. రామ్, నాగశౌర్య, సందీప్ కిషన్‌లను వరుసగా 2, 5, 9 స్థానాల్లో పెట్టి.. పైన చెప్పుకున్న హీరోలను కింద పడేయడం వారి అభిమానులకు నచ్చట్లేదు.
This post was last modified on June 3, 2021 10:40 am
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…