యువ కథానాయకుడు నితిన్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అత్యధిక బడ్జెట్లో ఓ సినిమా చేయడానికి కొన్నేళ్ల నుంచి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ సినిమానే.. పవర్ పేట. ‘రౌడీ ఫెలో’తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత నితిన్‌తో ‘ఛల్ మోహన్ రంగ’ తీసిన లిరిసిస్ట్ కృష్ణచైతన్య ఈ చిత్రాన్ని రూపొందించాల్సింది. ‘ఛల్ మోహన్ రంగ’ విడుదలై మూడేళ్లు దాటిపోగా.. ఆ చిత్రం రిలీజైన కొన్ని నెలల నుంచే కృష్ణచైతన్య ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నాడు.
తమిళంలో ‘వడ చెన్నై’ తరహాలో ఆంధ్రా ప్రాంతంలో రౌడీయిజానికి పెట్టింది పేరైన ఓ ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి కృష్ణచైతన్య చాలానే కసరత్తు చేశాడు. పవర్ పేట చరిత్ర, నేపథ్యం మీద ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేశాడు. భారీ బడ్జెట్ అయ్యే ఈ చిత్రానికి వేరే నిర్మాతల కోసం చూడకుండా నితినే డబ్బులు పెట్టడానికి కూడా రెడీ అయ్యాడు. ఐతే కొన్నేళ్ల పాటు ఈ ప్రాజెక్టు మీద కలిసి పని చేశాక.. చివరికి ఇప్పుడు కృష్ణచైతన్యకు హ్యాండ్ ఇచ్చేశాడు నితిన్.
చెక్, రంగ్ దె ఆశించిన ఫలితాలనివ్వకపోవడం నితిన్ ఆలోచనను మార్చినట్లుంది. ప్రస్తుతం తన మార్కెట్ అంత బాగా లేదు, పైగా కరోనా కారణంగా ఫైనాన్స్ సమస్యలూ తలెత్తుతున్నాయి. పైగా ‘పవర్ పేట’ రాజకీయాలతో ముడిపడ్డ కథాంశం. కాబట్టి ఇప్పుడీ సినిమా చేయడం మంచిది కాదని భావించి నితిన్ వెనక్కి తగ్గినట్లున్నాడు. దీని బదులు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకు త్వరలోనే ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారన్న సమాచారం నేపథ్యంలో ‘పవర్ పేట’ పక్కకు వెళ్లినట్లే. భవిష్యత్తులో అయినా నితిన్ ఈ సినిమా చేస్తాడా అన్నది సందేహమే. మరి ఈ స్క్రిప్టు మీద దాదాపు మూడేళ్లు పని చేసిన కృష్ణచైతన్య పరిస్థితేంటన్నది ప్రశ్న. ఈ కథను ఇంకో హీరో చేయడం కూడా డౌటే. కాబట్టి ఇక వేరే స్క్రిప్టు మీద పడాలి. ఇంకో హీరోను వెతుక్కోవాలి. మరో మార్గం లేదు.
This post was last modified on June 3, 2021 9:14 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…