తెలుగుదేశం నేత మాజి ఎంపి మాగంటి బాబుకు ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. ఆయన రెండో కుమారుడు రవీంద్రనాథ్ తాజాగా మరణించారు. కొన్ని వారాల క్రితమే ఆయన పెద్దకుమారుడు రాంజీ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ శోకం నుంచి మాగంటి కుటుంబం కోలుకోలేదు. ఇలాంటి తరుణంలో ఆయన రెండో కుమారుడు కూడా మరణించడం సంచలనం అవుతోంది.
మరణానికి కారణాలు ఏంటో తెలియడం లేదు. ఒక వర్గం ఏమో ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు అని చెబుతోంది. మరోవైపు నుంచి ఆయన ఒక స్టార్ హోటల్లో మరణించారు అని సమాచారం తెలుస్తోంది. కుటుంబం గాని, పోలీసులు గాని ఇంకా దీనిపై మాట్లాడినట్లు వీడియోలేమీ బయటకు రాలేదు.
రెండో కొడుకు రవీంద్రనాధ్ కొద్దిరోజులుగా స్టార్ హోటల్లో ఉంటున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా కొన్ని వారాల వ్యవధిలో ఒక ప్రముఖ నేత తన ఇద్దరు సంతానాన్ని కోల్పోవడం ఇటీవల కాలంలో ఎన్నడూ ఎవరింట జరగలేదు. ప్రత్యర్థులు కూడా జాలి చూపేటంత విషాదమిది. వారసులు ఇద్దరు కోల్పోయిన ఆ కుటుంబానికి ఇక ఓదార్పేదీ!
Gulte Telugu Telugu Political and Movie News Updates