టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదటినుండి కూడా యూత్ ఫుల్ కథలను ఎన్నుకుంటూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె చివరిగా తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. సమంత నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు నందినిరెడ్డి తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. నాగశౌర్యతో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అలానే మరో ఇద్దరు, ముగ్గురు యంగ్ హీరోల పేర్లు వినిపించాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా నందినిరెడ్డి టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు యంగ్ హీరోలు నాగచైతన్య, సంతోష్ శోభన్ లతో నందిని సినిమాలు చేయబోతున్నారు. నిజానికి ముందుగా నాగచైతన్యతో సినిమా మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం వలన కుర్ర హీరో సంతోష్ శోభన్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నందిని రెడ్డి. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తరువాత సంతోష్ శోభన్ కి సరైన హిట్టు పడలేదు.
రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ ఓకే అనిపించింది. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంది. దీంతో సంతోష్ కి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. అయితే ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించబోతున్న సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. ఈ రెండు సినిమాలతో పాటు నందిని రెడ్డి.. గీతాఆర్ట్స్ లో మరో సినిమా చేయడానికి అంగీకరించారు. మరోపక్క ‘ఆహా’ యాప్ కోసం కొన్ని స్క్రిప్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు.
This post was last modified on June 2, 2021 6:07 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…