Movie News

రామ్ చరణ్ నిర్మాత.. రవితేజ హీరో

మలయాళంలో రెండేళ్ల కిందట మంచి విజయం సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రం తెలుగులో రీమేక్ కాబోతున్నట్లు ఏడాది కిందటే వార్తలొచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ హక్కులు కొన్నట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
రీమేక్‌లో చరణే నటిస్తాడని కూడా అన్నారు. ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన సినిమా స్టార్ పాత్రను చరణ్ ఇక్కడ చేస్తాడని వార్తలొచ్చాయి.

ఆ తర్వాత ఒక దశలో ఈ పాత్రకు పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పటిదాక ఏ అధికారిక సమాచారం బయటికి రాలేదు. ఐతే ఇటీవల ఈ సినిమాకు రవితేజ పేరు వినిపించింది. పృథ్వీరాజ్ పాత్రను అతనే చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీలో కూడా చెప్పుకున్నారు. ఇది వాస్తవమే అని.. మాస్ రాజా ప్రధాన పాత్రలో రామ్ చరణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్‌ను ప్రొడ్యూస్ చేయబోతుండటం ఖరారైందని ఇండస్ట్రీలో కొంచెం గట్టిగానే వినిపిస్తోంది.

ఈ వార్త నిజమే అయితే.. మాస్ రాజా డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లే. ఎందుకంటే.. ‘డ్రైవింగ్ లైసెన్స్’ రవితేజ ఎక్కువగా చేసే మాస్ మసాలా సినిమాల టైపు కాదు. మాస్ రాజా ఎప్పుడు ప్రయోగాల బాట పట్టినా అతడికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. నా ఆటోగ్రాఫ్, సారొచ్చారు, డిస్కో రాజా లాంటి సినిమాలతో రవితేజకు తల బొప్పి కట్టేసింది. ప్రయోగాత్మక, క్లాస్ చిత్రాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా గత ఏడాది ‘డిస్కో రాజా’ అయితే ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో.. ఆ తర్వాత చేసిన మాస్ మూవీ ‘క్రాక్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.

ఇలాంటి స్థితిలో రవితేజ మళ్లీ ‘డ్రైవింగ్ లైసెన్స్’ లాంటి ప్రయోగాత్మక సినిమాకు ఓకే అంటాడా అన్న డౌట్లున్నాయి. కాకపోతే మంచి వినోదానికి స్కోప్ ఉన్న సినిమా కావడంతో మాస్ రాజా ధైర్యం చేస్తుండొచ్చు. పైగా రామ్ చరణ్ నిర్మాణంలో సినిమా అయ్యేసరికి కాదనలేకపోయి ఉండొచ్చు.మరి ఒరిజినల్లో సూరజ్ చేసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పాత్రను ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం.

This post was last modified on May 31, 2021 3:37 pm

Share

Recent Posts

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

1 hour ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

1 hour ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

2 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

3 hours ago

వాహ్ విజయ్… తడబడతాడనుకుంటే నిలబడ్డాడు!

తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…

3 hours ago

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

5 hours ago