Movie News

బాలును చంపేశారంటున్న ఆయన

గత ఏడాది దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా కలచివేసింది. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాక కూడా చాలా హుషారుగా మాట్లాడి, తాను బాగున్నానని, త్వరలోనే తిరిగి ఇంటికి వచ్చేస్తానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత విషమ స్థితిలోకి వెళ్లడం.. చివరికి మృత్యువుతో పోరాడి ఓడిపోవడం.. అభిమానులను విషాదంలోకి నెట్టడం తెలిసిందే. కరోనా నెగెటివ్ వచ్చాక కూడా ఆయన కోలుకోకపోవడం.. పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్లతో ప్రాణాలు వదలడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

ఐతే బాలుకు చికిత్స అందించడంలో పొరబాట్లు జరిగాయని.. కొవిడ్‌ను కట్టడి చేయడంలో స్టెరాయిడ్లను విపరీతంగా వాడటంతో ఆయన శరీరం తట్టుకోలేకపోయిందని.. అందువల్లే అవయవాలు దెబ్బ తిని ప్రాణాలు కోల్పోయాయని కొందరు వైద్యులు అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ఇదే విషయమై ‘కీటో డైట్’తో పాపులర్ అయిన వీరమాచనేని రామకృష్ణ మాట్లాడారు. బాలు కరోనాతో చనిపోలేదని.. ఆయన్ని వైద్యులు చంపేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదం, ఇతర వైద్యాల విషయంలో సవాలక్ష ప్రశ్నలు వేసే అలోపతి వైద్యులు.. కరోనా చికిత్సలో ఎన్ని తప్పులు చేశారో ప్రపంచం గుర్తించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో బాలు మరణాన్ని ఆయన ఉదహరించారు.

“బాలు గారు ఆసుపత్రికి వెళ్లినపుడు ఎంతో హుషారుగా వెళ్లారు. నీకేం లేదు వెళ్లవయ్యా అని ఉంటే ప్రాణంతో వచ్చేసేవారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన్ని తీసుకెళ్లి ప్రయోగాలు చేసి చంపేశారు. ఆయనకిచ్చిన మందులు ఎవరికిచ్చినా చనిపోతారు. అసలు మనిషి స్టామినా ఎంత? వాళ్లు ఇచ్చే మందుల పవర్ ఎంత? మనిషి తట్టుకోగలడా? ఈ మందుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇంట్లో ఎలుకని చంపాలంటే ఇల్లు తగలబెట్టడం లాగే ఉంది. బాలుగారేమైనా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడా? యాక్సిడెంట్లో పచ్చడైపోయి వెళ్లాడా? ఆసుపత్రికి నడుచుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఆయనలా ఇంకెంతోమంది ఉన్నారు. కేవలం ప్రయోగాలు చేసి, అనవసర మందులు వాడి ఆయన్ని చంపేశారు. బాలుగారి చికిత్సలో లోపాలున్నాయని నేను చెప్పడం కాదు. వందల మంది డాక్టర్లు చెప్పారు” అని వీరమాచనేని అన్నారు.

This post was last modified on May 31, 2021 6:50 am

Share
Show comments

Recent Posts

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 minutes ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

46 minutes ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

5 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

6 hours ago