బాలీవుడ్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న నటుడు రణదీప్ హుడా. ఇటీవలే విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’లో అతను విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అంతకుముందు వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి, సాహెబ్ బివి ఔర్ గ్యాంగ్ స్టర్, హైవే లాంటి సినిమాలతో అతను మెప్పించాడు. ఈ నటుడు ఇప్పుడు అనుకోని విధంగా పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. అతణ్ని అరెస్ట్ చేయలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడుస్తుండటం గమనార్హం.
ఇందుక్కారణం గతంలో జరిగిన ఒక కామెడీ టాక్ షోలో భాగంగా అతను మాయావతి మీద జోక్ పేల్చడమే. అది కామెడీ షో కావడంతో రణదీప్.. ఒక సెక్సిస్ట్ జోక్ వేశాడు. కొంచెం వల్గారిటీ ఉన్న ఆ జోక్‌ను ఇక్కడ ప్రస్తావించడానికి ఇబ్బందే. ఐతే రణదీప్ జోక్ పేల్చింది ఒక కామెడీ షోలో కాబట్టి దీన్ని ఆ కోణంలోనే చూడాలి. అన్నింటికీ మించి ఇది కొత్త వీడియో కాదు.
ఐతే ఎవరో ఒక నెటిజన్.. ఈ వీడియోను బయటికి తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో విరుచుకుపడింది. దాన్ని మిగతా వాళ్లు వైరల్ చేశారు. చూస్తుండగానే ఆ వీడియో ట్విట్టర్లో ట్రెండ్ అయిపోయింది. అంతే కాక.. #Arrestrandeephooda అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. అది ఇండియాలో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం గమనార్హం. దళిత నేత అయిన మాయావతి గురించి ఇలాంటి జోక్ పేల్చడమేంటి.. ఇది దళితులను కించపరచడమే.. మహిళల్ని అవమానించడమే అంటూ నెటిజన్లు రణదీప్ మీద విరుచుకుపడుతున్నారు.
ఐతే ఎప్పటి వీడియోనో పట్టుకువచ్చి ఇప్పుడు రణదీప్ మీద విమర్శలు చేయడం, అతణ్ని అరెస్ట్ చేయాలనడం ఏంటి అని తన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. జోక్‌ను జోక్ లాగా తీసుకోకుండా కులం, లింగ భేదం తీసుకురావడం ఏంటి అని వాళ్లు వాదిస్తున్నారు. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
This post was last modified on May 28, 2021 2:03 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…