బ్రహ్మాస్త్ర.. బాలీవుడ్‌కు ఓ బాహుబలి కాగలదని అంచనాలున్న భారీ చిత్రం. కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలొచ్చాయి. రెండేళ్ల కిందటే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లగా.. చిత్రీకరణలో జాప్యం, కరోనా, ఇతర కారణాల వల్ల ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఆలస్యమైంది.
పరిస్థితులను బట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో బ్రహ్మాస్త్ర-1ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గాక రిలీజ్ డేట్ ప్రకటించాలనుకుంటున్నారు. కాగా సినిమా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. కొంచెం ముందుగానే ప్రమోషన్ హడావుడి మొదలుపెట్టాలనుకుంటున్నారు.
బాలీవుడ్లో సినిమాల ప్రమోషన్ కోసం ఒక బడ్జెట్ కేటాయించి, ఒక పద్ధతి ప్రకారం పబ్లిసిటీ చేస్తారు. బ్రహ్మాస్త్ర విషయంలో ఈ ప్రణాళికలు భారీగానే ఉన్నాయట. ఏకంగా ఈ సినిమా కోసం 13 షార్ట్ టీజర్లు సిద్ధం చేస్తున్నారట. సినిమా రిలీజయ్యేలోపు సమయానుకూలంగా ఈ టీజర్లను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు.. సినిమాలో ఒక్కో పాత్రకు సంబంధించి మోషన్ పోస్టర్లు కూడా వదలబోతున్నారట.
ఇప్పటికే కంటెంట్ అంతా రెడీ అయిందని.. మరికొన్ని రోజుల్లో ప్రమోషనల్ హంగామా మొదలు కాబోతోందని అంటున్నారు. 5 వేల ఏళ్ల కిందటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సోషియా ఫాంటసీ మూవీలో రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఇతర ముఖ్య పాత్రల్లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ తదితరులు నటించారు.
This post was last modified on May 27, 2021 10:38 am
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే కొలువుల కోత మొదలుకాగా… త్వరలోనే హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి. ఎందుకంటే..…
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…