Movie News

ఈషా రెబ్బా.. ఇది నెక్స్ట్ లెవెల్


తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా కెరీర్ ఆరంభంలో చేసిన అంత‌కుముందు ఆ త‌రువాత‌, బందిపోటు లాంటి సినిమాల్లో క‌నిపించిన లుక్స్‌కు, ప్ర‌స్తుతం ఆమె లుక్స్‌కు అస‌లేమాత్రం పోలిక క‌నిపించ‌దు. అప్ప‌టికి తెలుగు హీరోయిన్లంటే మ‌రీ ట్రెడిష‌న‌ల్ అనే ముద్ర‌కు త‌గ్గ‌ట్లే ఆమె క‌నిపించింది. కానీ త‌ర్వాతి కొన్నేళ్ల‌లో ఆమె అప్పీయ‌రెన్స్ మారుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఉత్త‌రాది నుంచి దిగుమ‌తి అయిన‌ స్టార్ హీరోయిన్ల‌కు దీటుగా గ్లామ‌ర్ విందు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈషా.


సినిమాలను మించి బ‌య‌ట ఫొటో షూట్ల‌తో ఈషా త‌న సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్ల‌ను అల‌రిస్తూ ఉంటుంది. ఆమె ట్విట్ట‌ర్ అకౌంట్ ఫాలో అయ్యేవాళ్ల‌కు త‌ర‌చుగా గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఆమె ఫొటో షూట్లు కొన్ని చూసి స్టార్ హీరోయిన్ల‌కు ఏం త‌క్కువ అంటూ కామెంట్లు చేస్తుంటారు నెటిజ‌న్లు. తాజాగా ఈషా షేర్ చేసిన ఫొటోలు చూస్తే గ్లామ‌ర్ డోస్ విష‌యంలో ఆమె నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయినట్లే క‌నిపిస్తోంది. లింగ‌రీ వేసుకుని క్లీవేజ్ అందాల‌ను ఆర‌బోస్తూ పార్కులో ప‌డుకున్న పోజుల‌తో ఉన్న ఈ ఫొటోలు ఈషా ఫాలోవ‌ర్ల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి.


ఇప్పటిదాకా ఈషా చేసిన ఫొటో షూట్లలో సెక్సీయెస్ట్ ఇదే అంటే అతిశయోక్తి కాదేమో. ఓ పెద్ద సినిమాలో మంచి గ్లామర్ రోల్ ఇవ్వాలే కానీ.. ఈషా ఏ స్టార్ హీరోయిన్‌కూ తీసిపోని విధంగా యువ ప్రేక్షకులను మెప్పించగలదని ఈ హాట్ లుక్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే చివరగా నెట్ ఫ్లిక్స్ వారి ‘పిట్టకథలు’ యాంథాలజీ ఫిలింలో నటించిన ఈషా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ఒక స్పెషల్ రోల్ చేసింది. తమిళంలో జీవీ ప్రకాష్ కుమార్ సరసన ఆమె కథానాయికగా ఓ సినిమాలో నటిస్తుండటం విశేషం.

This post was last modified on May 26, 2021 10:53 am

Share
Show comments

Recent Posts

చంద్రబాబు భూమికే ఎసరు పెట్టేశారే!

వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…

2 hours ago

స‌ల‌హాదారులు వ‌చ్చేస్తున్నారు.. బాబు తాంబూలం వారికే.. !

రాష్ట్రంలోని కూట‌మి స‌ర్కారు ఇప్ప‌టి వ‌ర‌కు నామినేటెడ్ ప‌ద‌వుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో సీఎం విచ‌క్ష‌ణ…

8 hours ago

విజ‌య వార‌ధి రెడ్డి.. విజ‌య‌మ్మ ఎంట్రీ..?

"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయ‌న మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుప‌డుతున్నా" ఓ 15 ఏళ్ల కింద‌ట క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన రాజ‌కీయం…

9 hours ago

మోదీకి నిర్మలనే ‘ఛాయిస్’ ఎందుకయ్యారంటే..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…

10 hours ago

అర్జున్ రెడ్డికి మొదటి ఛాయస్ సాయిపల్లవి : సందీప్ వంగా

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…

11 hours ago

పెద్దిరెడ్ది అయినా!… పిచ్చిరెడ్డి అయినా!

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…

12 hours ago