ఏక్ మిని కథ.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి థియేటర్లు మూత పడ్డ వేళ నేరుగా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన మరో చిన్న సినిమా. గత నెల 30న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ.. థియేటర్లు మూత పడటంతో వాయిదా వేయక తప్పలేదు. తర్వాత చూస్తే ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో అమేజాన్ ప్రైమ్ వాళ్లతో డీల్ కుదుర్చుకుని నేరుగా డిజిటల్ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు మేకర్స్.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఇప్పటిదాకా చూడని ఒక బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఆ కాన్సెప్ట్ గురించి ఇప్పటిదాకా మీడియా వాళ్లు కూడా తమ వార్తల్లో రాయలేక పోతుండటం గమనార్హం. దీని టీజర్, ట్రైలర్ గురించి వార్తలు రాస్తున్నపుడు కూడా కాన్సెప్ట్ గురించి రాయడానికి మొహమాటపడిపోతున్నారు.
ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే ఏక్ మిని కథలో హీరో అంగం చిన్నది. దాని గురించి అతను తెగ ఫీలైపోతుంటాడు. చివరికి ఎన్‌లార్జింగ్ సర్జరీ చేయించుకుని అంగాన్ని పెంచుకోవాలనుకుంటాడు. ఈ కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఐతే మాట్లాడుకోవడానికే ఏదోలా అనిపించే ఇలాంటి కాన్సెప్ట్ మీద తెలుగులో ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా రావడం అంటే ఆశ్చర్యమే. గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి ఎంత మారినా.. బోల్డ్ కాన్సెప్ట్స్‌ను బాగానే స్వాగతిస్తున్నా.. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీసే సాహసం చేయడం విశేషమే.
ఐతే దీన్నో బూతు చిత్రం అనుకోకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లాగే తీసినట్లున్నారు యువి వాళ్లు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ ఇవ్వడం విశేషం. కార్తీక్ రాపోలు అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశాడు. ఒకప్పుడు బాలీవుడ్లో వీర్య దానం మీద విక్కీ డోనర్ తీసినపుడు మొదట అందరూ ఇలాంటి కాన్సెప్ట్ మీద సినిమానా అన్నారు. కానీ సినిమా చూసి అందరూ మెచ్చుకున్నారు. ఫ్యామిలీస్‌ను కూడా ఆ చిత్రం బాగా ఆకట్టుకుంది. తెలుగులో ఇప్పుడు ఏక్ మిని కథ అలాంటి ప్రయత్నమే అనుకోవచ్చు. మరి మన ప్రేక్షకులు దీన్ని ఏమేర స్వాగతిస్తారో.. సినిమాకు ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి.
This post was last modified on May 25, 2021 10:44 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…