సాయిధరమ్ తేజ్ సినిమా రేయ్ విడుదలై ఆరేళ్లు దాటింది. ఈ చిత్ర దర్శకుడు వైవీఎస్ చౌదరి దీని కంటే ముందు తీసిన సలీమ్ 2009లో విడుదలైంది. అంటే మధ్యలో ఆరేళ్ల విరామం అన్నమాట. రేయ్ సినిమా మొదలైన నాలుగేళ్లకు కానీ విడుదల కాలేదు. ఒక దశలో ఈ సినిమా రిలీజే కాదని అనుకున్నారు. కానీ చాలా కష్టపడి సినిమాను రిలీజ్ చేయగలిగారు. అంచనాలకు తగ్గట్లే అది డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బకు చౌదరి ఆర్థికంగా గట్టి దెబ్బే తిన్నాడు. సంక్షోభంలో పడిపోయాడు. కెరీర్లో చౌదరికి గతంలోనూ ఇలాంటి దెబ్బలు తగిలాయి. కానీ ఇంతకుముందు మాదిరి ఈసారి కోలుకోలేకపోయాడు. రేయ్ తర్వాత కొత్త సినిమా గురించి ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి.
మళ్లీ సినిమా తీస్తా.. ఈసారి ప్రేమకథ చేయబోతున్నా.. అందరూ కొత్త వాళ్లే నటిస్తారు.. అంటూ ఎప్పట్నుంచో ఆయన చెబుతూనే ఉన్నాడు. ఈ మాటలతోనే కాలం గడిచిపోతోంది. రెండు రెండేళ్లలో అయితే చౌదరి అడ్రస్ లేకుండా పోయాడు. ఇండస్ట్రీలో కనిపించడమే మానేశాడు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి తన పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ మీడియాలోకి వచ్చాడు. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా మళ్లీ కొత్త సినిమా గురించి మాట్లాడాడు. కొత్తవాళ్లతో ప్రేమకథ తీయబోతున్నట్లు చెప్పాడు.
దాని గురించి ఆసక్తికర ముచ్చట్లూ పెట్టాడు. అలాగే తన బొమ్మరిల్లు బేనర్ మీద వెబ్ కంటెంట్ కూడా చేయబోతున్నానన్నాడు. ఐతే ఏదో పుట్టిన రోజు వచ్చింది కదా, మీడియా వాళ్లు అడిగారు కదా అని ఎప్పట్లాగా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చాడా.. లేక నిజంగానే ఈసారైనా సినిమా చేసే ఉద్దేశం చౌదరికి ఉందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈసారి ఆయన రంగంలోకి దిగకుంటే ఇంకెప్పుడూ ఆయన మాటల్ని జనాలు నమ్మరేమో.
This post was last modified on May 23, 2021 11:48 pm
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…