Movie News

అందరివాడు రాజు

సినీ పరిశ్రమలో అందరి వాడు అనే పేరు అందరికీ రాదు. అందులోనూ ఒక పీఆర్వోకు అందరివాడు అని పేరు రావడం ఇంకా కష్టం. ఎందుకంటే సినిమాలకు పీఆర్ చేయడం కోసం టాలీవుడ్లో బోలెడంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక టీం ఉంది. గత దశాబ్దంలో పీఆర్ బ్యాచ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి. ఎవరికి వాళ్లు సినిమాకు తాము చేసినట్లు ఇంకెవరూ పబ్లిసిటీ చేయలేరు అని ప్రొజెక్ట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. ఒక బ్యాచ్ గురించి ఇంకో బ్యాచ్ నెగెటివ్ ప్రచారాలు చేయడమూ మామూలే. అలా చేస్తేనే మనకు ఎక్కువ సినిమాలు వస్తాయి. అవతలి వాళ్లకు తగ్గుతాయి.

ఇలాంటి ఫీల్డ్‌లో బీఏ రాజుకు ఉన్న మంచి పేరు.. అందరితోనూ ఆయనకున్న సత్సంబంధాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన గురించి ఇండస్ట్రీలో పీఆర్వోలే కాదు. ఎవ్వరూ చెడుగా మాట్లాడరు. ఆయన ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడరు. ఇక రాజు పీఆర్ చేసిన సినిమా అంటే అది అందరిదీ. మిగతా పీఆర్వోలు కూడా దాన్ని ఓన్ చేసుకుని పబ్లిసిటీ చేస్తారు. అలాగే రాజు కూడా ప్రతి సినిమానూ తనదిగా భావిస్తాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా.. అలాగే వెబ్ సైట్, మ్యాగజైన్ ద్వారా మంచి ప్రచారం చేసి పెడతాడు.

సినీ పరిశ్రమలో ఎన్నో వర్గాలు ఉండగా.. రాజుకు మాత్రం ఆ వర్గాలతో ఏ సంబంధం ఉండదు. ప్రతి సినిమా ఆడాలని.. పరిశ్రమ కళకళలాడాలని ఆశించే అరుదైన వ్యక్తుల్లో ఆయనొకరు. రాజు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు. నందమూరి కుటుంబానికి ఆప్తుడు. అలాగే ఘట్టమనేని, దగ్గుబాటి కుటుంబాలకూ కావాల్సిన వాడు. ఒకప్పటి తరంలో సూపర్ స్టార్ కృష్ణతో మొదలుపెడితే.. ఈ తరం యువ కథానాయకులందరితోనూ ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.

ఇప్పుడున్న కథానాయకుల్లో అందరిలోకి మహేష్ బాబు అంటే రాజుకు అమితమైన అభిమానం. కృష్ణతో ఉన్న అనుబంధం వల్ల మహేష్‌ను చిన్నతనం నుంచి దగ్గరగా చూస్తున్నాడు. హీరోగా అరంగేట్రం చేసినప్పటి నుంచి పక్కనే ఉండి మహేష్‌ను, అతడి సినిమాలను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ‘మా బాబు’ అంటూ మహేష్ బాబును ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ పీఆర్ పరంగా మహేష్‌కు ఎంతో చేశాడాయన. రాజు లేకుండా మహేష్ బయట ఏ కార్యక్రమానికీ హాజరు కాడంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు రాజు మరణంతో మహేష్ ఒక కుటుంబ సభ్యుణ్ని కోల్పోయినట్లే ఫీలవుతున్నాడంటే రాజుతో ఉన్న అనుబంధం అలాంటిది. నాగార్జున లాంటి మరికొందరు సైతం రాజు మీద బాగా ఆధారపడతారు. ఇలా ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ అనుబంధం పెనవేసుకున్న రాజు.. ఇలా హఠాత్తుగా వెళ్లిపోవడం టాలీవుడ్‌కు తీరని లోటు అనడంలో మరో మాట లేదు.

This post was last modified on May 22, 2021 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

21 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago