గత ఏడాది లాక్ డౌన్ ప్రకటన అనంతరం వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరడానికి ఎంత అవస్థలు పడ్డారో తెలిసిందే. తట్టా బుట్టా చేత బట్టుకుని, పిల్లల్ని నడిపించుకుంటూ వందల కిలోమీటర్లు నడిచి వెళ్లిన వారి దయనీయ స్థితి చూస్తే అందరికీ కన్నీళ్లు వచ్చేశాయి. కానీ ఆ సమయంలో ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేసిన స్థితిలో సోనూ సూద్ వలస కార్మికుల కోసం దేవుడిలా ముందుకొచ్చాడు. వేలాది మందిని తమ గమ్య స్థానాలకు చేర్చాడు. అక్కడ మొదలైన అతడి సేవా ప్రస్థానం.. తర్వాత అనితర సాధ్యమైన స్థాయికి చేరుకుంది.
ఈ ఏడాది కాలంలో అతను చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే గత ఏడాది సోనూ సేవా కార్యక్రమాలు చేస్తున్నపుడు ఎవరి నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదు. వ్యతిరేకత కనిపించలేదు. అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎవ్వరూ పెద్దగా చేయలేదు.
కానీ ఇప్పుడు కథ మారింది. గత ఏడాది కంటే గొప్పగా సోనూ తన సేవను సాగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్న వేలాది అభ్యర్థనలను పరిశీలించి వీలైనంత మేర సాయపడుతున్నాడు. బెడ్లు సమకూర్చి పెడుతున్నాడు. ఆక్సిజన్ అందిస్తున్నాడు. అత్యవసర మందులు అందిస్తున్నాడు. కానీ ఈ పనులను అభినందించడం పోయి లోపాలు వెతికే ప్రయత్నం జరుగుతోంది. అతను చేస్తున్న సేవ గురించి జరుగుతున్న ప్రచారం ఫేక్ అని పనిగట్టుకుని ఓ ప్రచారం నడుస్తోంది. ఎక్కడ ఏ చిన్న లోపం కనిపించినా దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సోనూకు ఇంత డబ్బెక్కడిది.. అతడికి సాయపడుతున్నదెవరు అని ప్రశ్నిస్తున్నారు. అతడికి వెనుక వాళ్లున్నారు వీళ్లున్నారు అంటూ నిందలేస్తున్నారు.
చివరికి చైనా వాళ్లు సోనూకు వందల కోట్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. రోజు రోజుకూ ఈ వ్యతిరేక ప్రచారం పెరుగుతోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మద్దతుదారులే ప్రధానంగా ఈ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ టైంలో మోడీ సర్కారు ఎంతగా వ్యతిరేకత ఎదుర్కొంటోందో తెలిసిందే. కరోనా కట్టడిలో, వైద్య సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మోడీని.. సోనూతో పోల్చి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
గత ఏడాది సోనూను పొగడ్డం మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు అతడితో పోల్చి మోడీ అండ్ కోను తిడుతుండటమే భాజపా మద్దతు దారులకు నచ్చనట్లుంది. అందుకే ఈ వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మున్ముందు సోనూ మీద తీవ్ర స్థాయిలో దాడి జరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎదుర్కోవడానికి అతను సిద్ధంగా ఉండాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 1:47 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…