అనన్య నాగళ్ల.. పేరు చూసే చెప్పేయొచ్చు తెలుగమ్మాయ్ అని. ‘మల్లేశం’ లాంటి మంచి సినిమాతో ఈ తెలంగాణ అమ్మాయి తెలుగు తెరకు పరిచయం అయింది. అందులో పల్లెటూరి తెలంగాణ పడుచుగా సహజమైన నటనతో ఆకట్టుకుంది అనన్య. ఆ తర్వాత ఆమె ‘ప్లే బ్యాక్’ అనే మరో చిన్న సినిమాలోనూ కథానాయికగా నటించింది. ఐతే హీరోయిన్‌గా చేసిన రెండు సినిమాలను మించి.. పవర్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘వకీల్ సాబ్’లో చేసిన క్యారెక్టర్ రోల్‌తో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది అనన్య.
ఐతే తొలి మూడు చిత్రాల్లో లుక్స్ పరంగా చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది అనన్య. ‘వకీల్ సాబ్’లో అయితే దాదాపు ఆమెది డీగ్లామరస్ రోల్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా నటించిన చిత్రాల్లో అనన్య గ్లామర్ ఎక్కడా ఎలివేట్ కాలేదు. ఆమెపై ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోయింది. ఐతే హీరోయిన్లు ఎవరూ కూడా ఇలాంటి ముద్రను కోరుకోరు.
హీరోయిన్లు గ్లామర్ కోణం చూపించకుంటే వాళ్ల కెరీర్ ముందుకు సాగదు. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఎప్పుడో కానీ రావు. వాటి కోసమే చూస్తూ కూర్చోలేరు. అందుకే మొదట్లో ఈ టైపు పాత్రలే చేసిన ఈషా రెబ్బా లాంటి వాళ్లు తర్వాత తమలోని హాట్ యాంగిల్ చూపించి ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేయడం చూశాం. ఇప్పుడు అనన్య సైతం ఇదే పని చేస్తోంది.
ఈ మధ్య ఔట్ డోర్లో శారీతో చేసిన ఒక ఫొటో షూట్‌తో అనన్యలోని కొత్త కోణం జనాలకు తెలిసింది. అందులో నడుము వంపులు చూపించే పోజులతో అనన్య కుర్రాళ్ల దృష్టిని ఆకర్షింది. అది సరిపోదన్నట్లు ఇప్పుడు డోస్ ఒక్కసారిగా పెంచేసింది అనన్య. తన ఆకర్షణ అంతా నడుములోనే ఉందని అనన్య బాగానే గుర్తించినట్లుంది. తాజాగా ఆమె తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో చూసి అనన్య ఇంత సెక్సీనా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూశాక మున్ముందు అనన్య నుంచి గ్లామర్ విందు బాగానే ఉండబోతోందని అర్థమవుతోంది.
This post was last modified on May 20, 2021 3:32 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…