కర్ణన్.. కర్ణన్.. గత నెలన్నర రోజుల నుంచి సౌత్ ఇండియాలో చర్చనీయాంశంగా మారిన సినిమా. గత నెల 9న థియేటర్లలో విడుదలై మంచి ఫలితాన్నందుకున్న ఈ చిత్రం.. ఇటీవలే అమేజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్లో రిలీజైంది. దీంతో ఈ సినిమా రీచ్ మరింత పెరిగింది. వివిధ భాషల వాళ్లు సబ్ టైటిల్స్ పెట్టుకుని సినిమా చూస్తున్నారు. కర్ణన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా కర్ణన్‌ను కొనియాడుతున్నారు.
ఇక ధనుష్ నటన గురించి చెప్పేదేముంది? ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించాడు. రెండు జాతీయ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. ధనుష్ సినిమాను ఎవరైనా రీమేక్ చేస్తుంటే.. పెర్ఫామెన్స్‌లో అతణ్ని మ్యాచ్ చేయగలరా అన్న సందేహాలు కలుగుతుంటాయి. ధనుష్ చేసిన అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ లాంటి సీనియర్ నటుడు చేస్తుండటం గమనార్హం. వెంకీ అయితే ధనుష్‌ను మ్యాచ్ చేయగలడనే అభిప్రాయాలున్నాయి.
కానీ కర్ణన్ లాంటి గొప్ప సినిమాను తెలుగులో బెల్లంకొడ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయనున్నారని కొన్ని రోజుల కిందట ప్రకటన వచ్చింది. అప్పుడే చాలామంది పెదవి విరిచారు. ఇక అమేజాన్ ప్రైమ్‌లో కర్ణన్‌ను ఇప్పుడు లక్షల మంది చూస్తున్నారు. వాళ్లందరికీ రీమేక్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఊర మాస్ సినిమాలు చేసుకునే బెల్లంకొండ శ్రీనివాస్‌తో కర్ణన్ లాంటి సినిమాను రీమేక్ చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ధనుష్ లాంటి నటుడిని అతను ఎలా మ్యాచ్ చేస్తాడనే సందేహాలూ కలుగుతున్నాయి.
మామూలు సినిమాల్లో కూడా బెల్లంకొండ శ్రీనివాస్ నటన గురించి ట్రోల్ జరుగుతుంటుంది. అలాంటిది ఎంతో డెప్త్ ఉన్న కర్ణన్ పాత్రను అతను చేయబోతున్నాడంటే ఆ ఊహే చాలామందికి ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ఈ పాత్ర కచ్చితంగా దెబ్బ తింటుందని.. దీని మేకర్స్ ఈ విషయంలో పునరాలోచించుకోవాల్సిందే అని బలంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 8:47 am
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…