Movie News

సోనూ సూద్ మీద నింద వేయ‌బోతే..


గ‌త ఏడాది క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో లాక్ డౌన్ పెట్టిన‌ప్ప‌టి నుంచి అస‌మాన సేవా కార్య‌క్ర‌మాల‌తో రియ‌ల్ హీరోగా ప్ర‌శంస‌లందుకుంటూ వ‌స్తున్నాడు సోనూ. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలోనూ అత‌ను అద్భుత రీతిలో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే అత‌డి ఉద్దేశాల మీద కొంద‌రికి అభ్యంత‌రాలున్నాయి. త‌న సేవ గురించి అతిగా ప్ర‌చారం చేసుకుంటున్నాడ‌ని.. కొన్ని ఫేక్ ప్ర‌చారాలు కూడా జ‌రుగుతున్నాయ‌ని ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌వుతున్న చోట సోనూ ఆప‌ద్బాంధ‌వుడిలా మారి సాయం అందిస్తుండ‌టంతో అధికార పార్టీల మ‌ద్ద‌తుదారులు అత‌డిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ మ‌ధ్య ప‌నిగ‌ట్టుకుని సోనూను త‌గ్గించే ప్ర‌య‌త్నం కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే సోనూ చేసిన ఒక ట్వీట్ గురించి చిన్న రాద్దాంతం జ‌రిగింది.

ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఒక వ్య‌క్తికి ఆక్సిజ‌న్ బెడ్ అవ‌స‌ర‌మ‌ని సోనూ టీంకు రిక్వెస్ట్ వ‌చ్చింది. కాసేప‌టికే స‌ద‌రు వ్య‌క్తికి బెడ్ అరేంజ్ చేసిన‌ట్లుగా సోనూ ఒక ట్వీట్ పెట్టాడు. ఐతే కాసేప‌టి తర్వాత దీనిపై గంజాం జిల్లా క‌లెక్టర్ స్పందించారు. బాధితుడికి తామే బెడ్ అరేంజ్ చేశామ‌ని.. సోనూ టీం నుంచి త‌మ‌ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని పేర్కొంటూ క‌లెక్టర్ ట్విట్ట‌ర్ అకౌంట్ నుంచి మెసేజ్ పోస్ట్ అయింది. దీంతో అంద‌రూ సోనూను అనుమానించ‌డం మొద‌లుపెట్టారు. కానీ త‌ర్వాత సోనూ అస‌లు విష‌యం చెప్పాడు. బాధితుడు త‌మ‌ను ఆక్సిజ‌న్ సౌక‌ర్యం ఉన్న బెడ్ కోసం వాట్సాప్ ద్వారా సంప్ర‌దించ‌డం.. తాము అరేంజ్ చేయ‌డం.. అత‌ను కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం.. ఈ మొత్తం మెసేజ్‌ల‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ల‌ను సోనూ షేర్ చేశాడు.

తాము ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను సంప్ర‌దించిన‌ట్లు ఎక్క‌డా క్లెయిమ్ చేసుకోలేద‌ని.. ఏదో ఒక మార్గంలో బాధితుడికి బెడ్ అందేలా మాత్రం చూశామ‌ని.. కావాలంటే ఆ వ్య‌క్తితో త‌మ సంభాష‌ణ‌ను ప‌రిశీలించుకోవ‌చ్చ‌ని అన్నాడు. అలాగ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల‌ను త‌క్కువ చేయ‌కుండా వారు చేస్తున్న మంచి ప‌నుల‌ను సోనూ ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 18, 2021 9:28 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

6 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago