ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాను ప్రకటించారు. ముందు అనుకున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కాకుండా తన 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నాడు తారక్. అనూహ్య పరిణామాల మధ్య ఈ చిత్రానికి దర్శకుడు మారాడు.
ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఈ సినిమానే చేయబోతున్నట్లుగా ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రకటన ఇచ్చారు. ఐతే తారక్ అభిమానుల దృష్టి ఉన్నది మాత్రం వేరే చిత్రం మీద. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో తారక్ ఎప్పుడు సినిమా చేస్తాడు.. దీని గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అని వాళ్లు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు.
దర్శకుడు ప్రశాంత్, మైత్రీ సంస్థ అధినేతలు.. అలాగే తారక్ వేర్వేరు సందర్భాల్లో ఈ సినిమా గురించి సంకేతాలు ఇచ్చారు. కానీ అధికారికంగా ఘనమైన ప్రకటన ఎప్పుడు వస్తుందన్న దాని మీదే అభిమానుల దృష్టి ఉంది. మధ్యలో అనుకోకుండా ప్రశాంత్ సలార్ సినిమాను తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్లీ ఇలా ఇంకో సినిమా ఏదైనా వచ్చి పడుతుందేమో అన్న కంగారు కూడా వారిలో లేక పోలేదు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చి.. ఆ సినిమా ఎప్పుడు మొదలై, ఎప్పుడు విడుదలవుతుందో ఒక క్లారిటీ వస్తే బాగుండని అనుకుంటున్నారు. ఐతే ఇందుకు ఇప్పుడు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఈ నెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేయనున్న సినిమా గురించి ఒక పోస్టర్ ద్వారా ఘనంగా అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతోందట మైత్రీ సంస్థ.
సినిమా ఎప్పుడు మొదలయ్యేది.. ఎప్పుడు రిలీజయ్యేది కూడా ఈ పోస్టర్లో ప్రకటిస్తారని అంటున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ టీం నుంచి తారక్ పుట్టిన రోజు నాడు కొత్త పోస్టర్ కూడా వదలనున్నారట. కొరటాల సినిమా నుంచి కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on May 18, 2021 8:30 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…