Movie News

తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న కొత్త యాస

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మెజారిటీ సినిమాల్లో ఒకే యాస ఉండేది. ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువమందికి కనెక్ట్ అయ్యే తెలుగునే సినిమాల్లో వాడేవాళ్లు. కామెడీ కోసమో, విలనీ కోసమో ఇతర ప్రాంతాల యాసను వాడుకునేవాళ్లు తప్ప వేరే యాసల్లో పూర్తి స్థాయి సినిమాలు రావడం అరుదుగానే జరిగేది. ఐతే 90వ దశకం చివర్లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలవడంతో తొలిసారిగా రాయలసీమ యాసకు తెలుగు సినిమాల్లో ప్రాధాన్యం పెరిగింది. కానీ ఈ సినిమాలు ఒక దశ దాటాక ఒక మూసలోకి వెళ్లిపోయాయి. సీమ యాస కూడా మొనాటనీ అయిపోయేలా చేశారు. ఐతే రాయల సీమ అంటే అంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపించే యాస మాత్రమే కాదు. అక్కడ కూడా ప్రాంతాలను బట్టి రకరకాల యాసలుంటాయి.

ముఖ్యంగా సీమలో చిత్తూరు జిల్లా యాస ప్రత్యేకం. ఆ జిల్లాలో పూర్తిగా ఒక యాస అంటూ ఉండదు. తమిళనాడు బోర్డర్లో ఉండే చిత్తూరు-తిరుపతి లాంటి ప్రాంతాల్లో తమిళ యాస కలిసిన భాషలో మాట్లాడతారు. ఈ యాసను నాని సినిమా ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’లో దర్శకుడు మేర్లపాక గాంధీ (తిరుపతి వాడే) భలేగా వాడుకున్నాడు. ఐతే ఆ సినిమా ఆడకపోవడం వల్ల ఆ యాస అంతగా పాపులర్ కాలేదు. ఇక చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి వైపు వెళ్తే నెల్లూరు, ఆంధ్రా ప్రభావం కనిపిస్తుంది. ఆ యాస అంత కొత్తగా ఏమీ కనిపించదు. ఐతే కుప్పం, పలమనేరు, పుంగనూరు లాంటి చోట్ల యాస మరో రకంగా ఉంటుంది. అక్కడి భాష, యాసపై కర్ణాటక ప్రభావం చాలా ఉంటుంది. ఈ యాసను ఇప్పటిదాకా ఎవ్వరూ పెద్దగా ఎలివేట్ చేయలేదు. సినిమాల్లో అయితే ఈ యాసను దాదాపుగా ఎప్పుడూ విని ఉండం. ఐతే తొలిసారిగా ‘సినిమా బండి’ చిత్రం పూర్తిగా ఈ యాసలోనే సాగడం విశేషం.

చిత్తూరు జిల్లాకే చెందిన బాలీవుడ్ దర్శకుడు రాజ్-డీకే ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ కంద్రేగుల అనే ఈ జిల్లాకు చెందిన కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. నటీనటులంతా ఈ ప్రాంతం వాళ్లనే తీసుకోవడంతో వాళ్లు తమ ప్రాంత యాసతో అదరగొట్టేశారు. ఇంతకుముందెన్నడూ వినని యాస, మాండలికాలు కావడంతో ‘సినిమా బండి’ కొత్త అనుభూతిని పంచుతోంది. ‘నీకేం పని లేదా’ అనే మాటనే ఈ ప్రాంతంలో ‘నీకేం పంగ లేదా’ అంటారు. ఇలాంటి కొత్త మాటలు చాలానే సినిమాలో వింటాం. కొన్ని పదాలు వేరే ప్రాంతాల వాళ్లకు అర్థం కాకపోయినా ఈ భాష, యాస కొత్తగా ఉండి ప్రేక్షకులు కొత్త అనుభూతిని లోనవుతున్నారు. త్వరలో రాబోతున్న సుకుమార్-అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప’ చిత్తూరు నేపథ్యంలోనే సాగనుంది. అది భారీ చిత్రం కాబట్టి చిత్తూరు భాష, యాసకు మంచి పాపులారిటీనే వచ్చే అవకాశముంది.

This post was last modified on May 16, 2021 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెగిన ప్రతి టికెట్టు సిద్దూ పేరు మీదే

నిన్న విడుదలైన సిద్దు జొన్నలగడ్డ 'జాక్'కు ఆశించిన స్థాయిలో స్పందన లేదు. రివ్యూలు పెదవి విరిచేయగా పబ్లిక్ టాక్ సైతం…

22 minutes ago

10 నెలల్లోనే 5 భేటీలు!.. ఇది కదా వృద్ధి అంటే!

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి…

30 minutes ago

వింటేజ్ అజిత్ దర్శనమయ్యింది కానీ

నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీకి తమిళనాడులో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అజిత్ ని ఇంత ఊర మాస్…

1 hour ago

హీరో-డైరెక్టర్.. ఇద్దరికే రూ.300 కోట్లు?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ అయిన అట్లీ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు…

4 hours ago

దేవిశ్రీ ప్రసాద్ తీసుకున్న ‘గుడ్’ నిర్ణయం

భారీ అంచనాల మధ్య విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ చూసి అజిత్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. దర్శకుడు అధిక్ రవిచందర్…

4 hours ago

ర‌వితేజ పెద్ద హిట్ మిస్స‌య్యాడా?

మాస్ రాజా ర‌వితేజ స‌రైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. క‌రోనా కాలంలో వ‌చ్చిన క్రాక్ మూవీనే ర‌వితేజ‌కు…

9 hours ago