టాలీవుడ్లో ఒక ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఆ మల్టీస్టారర్లో నటించేది సీనియర్ హీరో రాజశేఖర్.. ఆయన తర్వాతి తరం కథానాయకుడు గోపీచంద్ అట. లక్ష్యం, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం లాంటి మాస్ ఎంటర్టైనర్లు తీసిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.
‘లక్ష్యం’తో తనపై బాగా అంచనాలు పెంచేసిన శ్రీవాస్.. ఆ తర్వాత ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. మధ్యలో ‘లౌక్యం’తో ఓకే అనిపించాడు కానీ.. మిగతా సినిమాలు నిరాశ పరిచాయి. చివరగా అతడి నుంచి వచ్చిన ‘సాక్ష్యం’ అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయాడు.
ఈ సినిమా వచ్చాక దాదాపు మూడేళ్ల నుంచి అతను ఖాళీగా ఉన్నాడు. గోపీచంద్‌తోనే ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది కానీ.. అది వర్కవుట్ కాలేదు. ఇంకో సినిమా కూడా మొదలైనట్లే మొదలై ఆగిపోయింది.
ఐతే ఎట్టకేలకు ఓ కథను ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించి మల్టీస్టారర్ చేయడానికి శ్రీవాస్ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘గరుడవేగ’తో మళ్లీ ఫామ్ అందుకుని వరుసగా సినిమాలు చేస్తున్న రాజశేఖర్.. మళ్లీ మంచి హిట్టు కోసం చూస్తున్న గోపీచంద్‌లతో అతను మల్టీస్టారర్ చేయనున్నాడట. ఈ ఇద్దరు హీరోలూ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.
ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కానున్నాడట. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి’ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్.. ‘శేఖర్’తో పాటు మరో రెండు థ్రిల్లర్ సినిమాలను స్వల్ప వ్యవధిలో అనౌన్స్ చేయడం తెలిసిందే. ఆ సినిమాల తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన మల్టీస్టారర్ చేయనున్నాడట. గోపీచంద్ విషయానికి వస్తే ‘సీటీమార్’ను పూర్తి చేసి ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘పక్కా కమర్షియల్’ చేస్తున్నాడతను.
This post was last modified on May 15, 2021 3:43 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…