యూట్యూబ్ హిట్స్ కలెక్షన్స్ అవుతాయా బన్నీ?

పుష్ప చిత్రం ఫస్ట్ లుక్ అదిరిపోయింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ తీయడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సుకుమార్ ఎంచుకున్న నేపథ్యం, బన్నీ గెటప్ పూర్తిగా మన నేటివిటీకి తగ్గట్లుంది.

సుకుమార్ కి హిందీ చిత్ర పరిశ్రమతో సంబంధం లేదు. రష్మిక కూడా అక్కడి వారికి పరిచయం లేదు. విజయ్ సేతుపతి ఉన్నాడు కాబట్టి తమిళంలో విడుదల చేయడం మంచి ఆలోచనే. అలాగే రష్మిక వల్ల కర్ణాటకలో అదనపు బలం ఉండొచ్చు. అల్లు అర్జున్ కి కేరళలో ఫాలోయింగ్ ఉంది. కనుక ఇది పాన్ సౌత్ ఇండియన్ సినిమా కావడానికి ఎలాంటి సమస్యా లేదు.

కానీ హిందీలోను విడుదల చేసే ఆలోచన ఉందంటే అది కేవలం బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకి యూట్యూబ్ లో వస్తున్నహిట్స్ వల్లనే. యూట్యూబ్ హిట్స్ బాక్సాఫీస్ కలెక్షన్లుగా మారతాయా లేదా అనేది పుష్ప హిందీలో విడుదలయితే కానీ తెలీదు.