Movie News

తెలుగు స్టార్లు తట్టుకోగలరా?


‘వకీల్ సాబ్’ సినిమాకు గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పారితోషకం రూ.50 కోట్లు అని ముందుగా వార్తలు వస్తే దాని గురించి పెద్ద చర్చే జరిగింది. ఒక్క సినిమాకు యాభై కోట్లా అంటూ కొందరు గుండెలు బాదేసుకున్నారు. పవన్‌ను వ్యతిరేకించే మీడియా దీని గురించి నెగెటివ్ న్యూస్‌లు కూడా ఇచ్చింది. ‘వకీల్ సాబ్’ విడుదల తర్వాత పవన్‌కు లాభాల్లో కూడా వాటా ఇచ్చారని, దీంతో మొత్తం పవన్‌కు రూ.65 కోట్ల దాకా ముట్టిందని కూడా అన్నారు. ఇదే నిజమైతే తెలుగులో ఇది రికార్డ్ అనడంలో సందేహం లేదు.

ఐతే పవన్‌కు ఆ స్థాయిలో రికార్డు స్థాయి పారితోషకం కట్టబెట్టిన నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తమిళంలో ప్రస్తుతం బిగ్గెస్ట్ స్టార్ అనదగ్గ విజయ్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తాజాగా అప్‌డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం ఏకంగా విజయ్ ఏకంగా రూ.90 కోట్ల పారితోషకం పుచ్చుకోనున్నట్లు మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.170 కోట్లు కాగా.. అందులో 50 శాతం కంటే ఎక్కువగా విజయ్ పారితోషకానికే కేటాయించారట. విజయ్ తమిళంలో సైతం ఈ స్థాయిలో పారితోషకం తీసుకోలేదు. గత కొన్నేళ్లలో విజయ్ మార్కెట్ తెలుగులో పెరుగుతూ వస్తుండగా.. నేరుగా తెలుగు సినిమా చేయడం, దిల్ రాజు బ్రాండ్ కూడా జత కలుస్తుండటంతో ఈ చిత్రానికి తెలుగులోనే ఇక్కడ మిడ్ రేంజ్ సినిమాల స్థాయిలో బిజినెస్ జరగొచ్చు.

ఇక తమిళనాడు మార్కెట్‌కు ఎలాగూ ఢోకా ఉండదు. విజయ్‌కి కేరళ, కర్ణాటకల్లోనూ మాంచి మార్కెట్ ఉంది. ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా కలుపుకుంటే ఈ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడం, విజయ్‌కు ఇంత పారితోషకం ఇవ్వడం ఇబ్బందేమీ కాదు. ఐతే నిజంగా రాజు ఈ స్థాయిలో విజయ్‌కు పారితోషకం ఇస్తే మన బడా స్టార్లు తట్టుకోగలరా అన్నదే సందేహం. ఒక తమిళ స్టార్‌కు తెలుగు టాప్ ప్రొడ్యూసర్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తే మాత్రం మన బడా స్టార్ల ఇగో దెబ్బ తినడం ఖాయం. మన స్టార్లు కూడా మున్ముందు పారితోషకాలు పెంచి కొత్త టార్గెట్ల మీద దృష్టిపెడతారేమో.

This post was last modified on May 11, 2021 6:34 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

1 hour ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago