కొన్ని సినిమాలు అనుకున్నంత ఆడకపోయినా.. అందులో నటీనటులు, టెక్నీషియన్లకు మంచి పేరు తెచ్చి పెడుతుంటాయి. ‘అందాల రాక్షసి’ లాంటి సినిమాలు ఈ కోవకే చెందుతాయి. ఈ సినిమా హీరో హీరోయిన్లు.. సంగీత దర్శకుడు.. అలాగే దర్శకుడు ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు అందుకోవడం తెలిసిందే. రెండేళ్ల కిందట విడుదలై పెద్ద డిజాస్టర్ అయిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ద్వారా దాని సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఏకంగా ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’కు మ్యూజిక్ చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు రష్మిక ‘డియర్ కామ్రేడ్’ ద్వారానే కెరీర్ ఛేంజింగ్ ఛాన్స్ అందుకోవడం విశేషం. రష్మిక కొన్ని నెలల కిందటే ‘మిషన్ మజ్ను’ అనే భారీ హిందీ చిత్రానికి సంతకం చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఆమెకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాకు సంతకం చేసిన కొన్ని రోజులకే హిందీలో మరో సినిమా చేసే అవకాశాన్ని కూడా ఆమె చేజిక్కించుకుంది.
సిద్దార్థ్ రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ కోసం రష్మికను తీసుకోవడానికి కారణం.. ఆమె ‘డియర్ కామ్రేడ్’లో ఇచ్చిన పెర్ఫామెన్సే అని ఆ చిత్ర దర్శకుడు శాంతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సినిమాలో హీరోయిన్ అమాయకంగా కనిపించాలని.. అదే సమయంలో ఓ కీలక సన్నివేశంలో వేరియేషన్ చూపించాలని.. ‘డియర్ కామ్రేడ్’లో రష్మిక నటన చూశాక అలా డిఫరెంట్ షేడ్స్ చూపించగల సత్తా రష్మికకు ఉందనిపించిందని శాంతను చెప్పాడు.
నిజానికి ఈ సినిమా కోసం వేరే హీరోయిన్ల పేర్లు కూడా పరిశీలించినప్పటికీ.. తాను కోరుకున్న పెర్ఫామెన్స్ రష్మికనే ఇవ్వగలదన్న నమ్మకం ‘డియర్ కామ్రేడ్’లో లిల్లీ పాత్రను చూస్తే కలిగిందని.. అందుకే ఈ సినిమాకు ఆమెను ఓకే చేశామని శాంతను తెలిపాడు. మొత్తానికి ‘డియర్ కామ్రేడ్’ కమర్షియల్‌గా చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ.. రష్మికకు ఈ రకంగా ఉపయోగపడిందన్నమాట.
This post was last modified on May 10, 2021 3:58 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…