డైరెక్టర్ అడగలేదు, హీరోనే ‘ప్యాక్’ చేస్తున్నాడు!

సిక్స్ ప్యాక్ చేసే పనిలో బిజీగా ఉన్నానని హీరో నిఖిల్ చొక్కా తీసేసి మరీ బేర్ బాడీతో ఫోటో పెట్టిన సంగతి తెలిసిందే. చందూ మొండేటి తీస్తున్న కార్తికేయ 2 కోసం నిఖిల్ ఈ కష్టం పడుతున్నాడు. అయితే ఇందులో సిక్స్ ప్యాక్ కావాలని నిఖిల్ ని దర్శకుడు కోరలేదట. తనంతట తానుగా డిసైడ్ అయి ఇది చేస్తున్నాడట.

నిర్మాణ పరంగా జరిగిన జాప్యం వల్ల టైం దొరకడంతో నిఖిల్ ముందు ఈ జిమ్మింగ్ మొదలు పెట్టాడు. ఈలోగా లాక్ డౌన్ కావడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల తన పెళ్లి కూడా ఆగిపోవడంతో నిఖిల్ పొద్దున్న,సాయంత్రం కసరత్తులు చేస్తూ ఇదిగో మొన్న చూపించిన ఫొటోలో మాదిరిగా తయారయ్యాడు.

మిగతా సిక్స్ ప్యాక్ కూడా రెడీ అయిపోతే నిఖిల్ చొక్కా విప్పడం కోసం కార్తికేయ 2 లో సీన్ క్రియేట్ చేయక తప్పదు. ఈ చిత్రాన్ని కారిత్కేయ సీక్వెల్ గా పిలుస్తున్నారు కానీ మొదటి సినిమాతో దీనికేమాత్రం సంబంధం ఉండదట.