కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఎదుటి వ్యక్తితో స్నేహపూర్వకంగా చేతులు కలపడానికి కూడా వీలులేకుండా పోయింది. ఇదే ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కొత్త చిక్కును తెచ్చిపెట్టింది. సినిమా అంటే హీరోహీరోయిన్ల మధ్య రొమన్స్ తప్పనిసరి. మిగిలిన భాషలతో పోలిస్తే మన సినిమాల్లో ఇలాంటి సీన్స్ తక్కువే.
అయితే కథలో ఎలా ఉన్నా, కనీసం పాటల్లో అయినా హత్తుకుపోయి, రొమాన్స్‌లో మునిగిపోతుంటారు టాలీవుడ్ హీరోహీరోయిన్లు. అయితే కరోనా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కానుంది. మరి ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ ఎలా తీయడం? ఇప్పటికే తైవాన్, యూకే లాంటి చాలాదేశాల్లో వెబ్, టీవీ షోలలో లిప్ లాక్ సీన్స్‌ను నిషేధించారట.
అడల్ట్ కంటెంట్‌ను మొహమాటం లేకుండా తెరకెక్కించే హాలీవుడ్‌లో కూడా రొమాంటిక్ సీన్స్ విషయంలో మార్పులు రాబోతున్నాయి. సినిమాల్లో ఇలాంటి సీన్స్ లేకపోతే ఓ వర్గం ప్రేక్షకులు బాగా డిస్సపాయింట్ అవుతారు. అలాగే కొన్ని కథలకు న్యాయం చేయాలంటే సినిమాలో ఇలాంటి సీన్స్ ఉండడం చాలా అవసరం.
అయితే హీరో సూర్య కోరిక మేరకు ‘బ్రదర్స్’ మూవీలో హీరోయిన్ లేకుండానే లిప్ లాక్ సీన్ తెరకెక్కించారు డైరెక్టర్. సినిమాలో ఈ సీన్స్ అచ్చు ఒరిజినల్‌గా ముద్దు పెట్టుకున్నట్టే ఉంటుంది. ఇకపై ప్రతీ సినిమా, వెబ్ సిరీస్‌ల్లో ఇలాగే రొమాంటిక్ సీన్స్ తీయాల్సి ఉంటుందేమో. ముద్దు సీన్ల వరకూ ఓకే కానీ, మిగిలిన సీన్లలో కూడా దూరంగా ఉండాలంటే చాలామంది యాక్టర్లు హార్ట్ అయ్యే అవకాశం ఉంది.
This post was last modified on May 14, 2020 2:40 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…