రెండ్రోజులకే అమెజాన్ లో వచ్చేసింది!

లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే సినిమా థియేటర్లపై నిషేధం విధించగా, అప్పటికి రిలీజ్ అయ్యి రెండు రోజులు మాత్రమే అయిన చిత్రాలు ఆశలు వదులుకోక తప్పలేదు. ఫిలిం ఫెస్టివల్స్ లో హల్చల్ చేసిన మధ అనే చిత్రం కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు నెమ్మదిగా వస్తారని ఆశ పడుతున్న టైంలో థియేటర్లు మూత వేయడంతో మధ సైడ్ అవ్వక తప్పలేదు.

లాక్ డౌన్ తీసేస్తే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేద్దామని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థుతులలో సినిమాలు రిలీజ్ చేయడం అసంభవమని అర్ధమైంది. దీంతో మధ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేసారు. ఇటీవలే విడుదలయిన పలాస 1978 కూడా ఇప్పుడు ఆన్ లైన్లో అందుబాటులో ఉంది.

నాని నిర్మించిన హిట్ కూడా కొంచెం త్వరగానే ఆన్ లైన్లోకి వచ్చి మంచి వ్యూస్ తెచ్చుకుంటోంది. సినిమా థియేటర్లపై ఆంక్షలు జూన్ వరకు అమలులో ఉంటాయనే వార్తల నేపథ్యంలో అసలు థియేటర్లలో విడుదలే కానీ సినిమాలని కూడా ఆన్ లైన్ రిలీజ్ కి చర్చలు జరుగుతున్నాయి.