పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా హిందీ చిత్రం పింక్ కు రీమేక్ గా రూపొందింది. హిందీలో లేని కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిజం ఈ సినిమాలో కలిపి విజయం సాధించారు. అయితే ఇప్పుడా సినిమా మారుతి దర్శకత్వంలో రూపొందతున్న “పక్కా కమర్షియల్” కు సమస్యగా మారిందని సమాచారం. “పక్కా కమర్షియల్” ప్రారంభించేనాటికి వకీల్ సాబ్ ఇంకా రిలీజ్ కాలేదు. దాంతో కోర్ట్ర్ రూమ్ డ్రామాకు, కమర్షిషయల్ ఎలిమెంట్స్ కలుపుతూ రాసుకున్న “పక్కా కమర్షియల్” స్క్రిప్టు కు, వకీల్ సాబ్ పోలికలు వచ్చాయిట. రెండు సినిమాలు కవలలుగా అనిపిస్తాయిట.
దాంతో వకీల్ సాబ్ చూసి రియిలైజ్ అయిన దర్శక,రచయిత మారుతి తనదైన శైలిలో స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారట. వకీల్ సాబ్ పోలీకలు ఉండకుండా ఉండటానికి ట్రై చేస్తున్నారట. సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఖాళీ సమయాన్ని మారుతీ చక్కగా వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. మారుతీ ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ చిత్రం స్క్రిప్ట్ పై రీవర్కింగ్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ లో కొన్ని బెటర్మెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపిచంద్ 29వ సినిమాగా రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు మేకర్స్.
మరో ప్రక్క గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న గోపిచంద్… సీటిమార్ సినిమాతో సాలిడ్ సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
This post was last modified on May 6, 2021 1:36 pm
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…