రెండున్నరేళ్ల కిందట ఇండియన్ బాక్సాఫీస్‌లో ప్రభంజనం సృష్టించిన సినిమా కేజీఎఫ్. ఓ కన్నడ సినిమా వివిధ భాషల్లో అలాంటి ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం ఆయా భాషల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతకంతకూ కలెక్షన్లు పెంచుకుని లాంగ్ రన్‌తో ఆశ్చర్యపరిచింది. యశ్ అన్ని భాషల్లో స్టార్ అయిపోయాడు.
‘బాహుబలి’ రెండో భాగం కోసం వివిధ భాషల ప్రేక్షకులు అప్పట్లో ఎలా ఎదురు చూశారో.. ‘కేజీఎఫ్-చాప్టర్:2’ కోసం కూడా ఇప్పుడు అలాగే ఉత్కంఠగా వేచి చూస్తున్నారు ఆడియన్స్. గత ఏడాది దసరాకే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. జులై 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ డేట్‌ను అందుకోవడానికి టీం గట్టిగానే కష్టపడుతోంది.
కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ‘సలార్’ షూటింగ్ చేస్తూనే దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడు. అవి చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుందని అంటున్నారు. కాగా ‘చాప్టర్-2’ ఫైనల్ కట్ నిడివి కొంచెం ఎక్కువే అన్నది చిత్ర వర్గాల సమాచారం. 2 గంటల 52 నిమిషాల రన్ టైంతో ‘కేజీఎఫ్-2’ను విడుదల చేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడట. చాప్టర్-1 విడుదలకు ముందే రెండో భాగానికి సంబంధించి సగం దాకా చిత్రీకరణ జరిగింది.
ఆ తర్వాత ఏడాది వ్యవధిలో మిగతా భాగమంతా చిత్రీకరించారు. రష్ మొత్తం ఎడిట్ చేశాక తుది నిడివి దాదాపు మూడు గంటలు వచ్చిందని.. అన్నీ ఆకర్షణీయంగా ఉండటంతో ఏ సన్నివేశాలూ తీసేయబుద్ధి కాలేదని.. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా నిడివి ఎక్కువ ఉన్నా చూస్తారని.. ఉన్న సన్నివేశాలను తీసేస్తే ఫ్లేవర్ పోతుందని.. కాబట్టి లెంగ్తీ రన్ టైంతోనే సినిమాను రిలీజ్ చేద్దామని ప్రశాంత్ ఫిక్సయ్యాడట. కాబట్టి దాదాపు మూడు గంటల పాటు కేజీఎఫ్ లోకంలో విహరించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉండాల్సిందే.
This post was last modified on May 4, 2021 7:30 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…